పేరెంట్స్ మీటింగ్ తర్వాత అమ్మ తిట్టిందని! | Class VIII Student Allegedly Commits Suicide After Attending PTM | Sakshi

పేరెంట్స్ మీటింగ్ తర్వాత అమ్మ తిట్టిందని!

Published Sun, Jul 31 2016 11:23 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

పేరెంట్స్ మీటింగ్ తర్వాత అమ్మ తిట్టిందని! - Sakshi

పేరెంట్స్ మీటింగ్ తర్వాత అమ్మ తిట్టిందని!

కరిష్మా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె పాఠశాలలో శనివారం పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం జరిగింది.

న్యూఢిల్లీ: కరిష్మా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె పాఠశాలలో శనివారం పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మీ బిడ్డ చదువుల్లో వెనుకబడిందని ఉపాధ్యాయులు చెప్పడం.. దాంతో తల్లి తిట్టడంతో మనస్తాపం చెందిన కరిష్మా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఈ ఘటన జరిగింది.    

పాఠశాలలో పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్ తర్వాత ఇంటికి వచ్చిన కరిష్మా శనివారం మధ్యాహ్నం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. కరిష్మా పేద కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి దినసరి వేతన కూలి. తన బిడ్డ కోసం బాగు కోసం తల్లి షాజాహనా తిట్టిందన్న చిన్న కారణంతో కరిష్మా ఆత్మహత్య చేసుకోవడం ఆ పేదకుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement