Crime News: నాలుగేళ్ల కిందట అక్కపై! ఇప్పుడు చెల్లిపై.. | Rajasthan Teacher Molest Sisters During 4 Years Gap Case Filed | Sakshi
Sakshi News home page

క్లాసులోనే అఘాయిత్యం: నాలుగేళ్ల కిందట అక్కపై! అదే సార్‌ ఇప్పుడు చెల్లిపై..

Published Tue, Mar 15 2022 11:47 AM | Last Updated on Tue, Mar 15 2022 1:45 PM

Rajasthan Teacher Molest Sisters During 4 Years Gap Case Filed - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు బడులు. అందులో టీచర్లే మార్గదర్శకులు. అలాంటిది తరగతి గదిలోనే.. విద్యార్థినులపై అత్యాచారాలు చేస్తున్న ఓ కామాంధుడి బాగోతం వెలుగుచూసింది. నాలుగేళ్ల వ్యవధితో అక్కాచెల్లెలు అయిన విద్యార్థినులపై అత్యాచారం చేయడంతో.. ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఆ మృగాన్ని కటకటాల వెనక్కి నెట్టి తమలాంటి బాధితులకు న్యాయం చేయాలంటూ పోరాడుతోంది.

రాజస్థాన్‌ నాగోర్ పట్టణంలోని పంచోరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల స్టేట్‌మెంట్‌ ప్రకారం.. సదరు కుటుంబంలోని పెద్దమ్మాయి 2018లో 9వ తరగతి చదువుతుండగా ఓ రోజు పీఈటీ హరిరామ్ (30) ఆమెను ఖాళీ తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. మళ్లీ 10వ తరగతి చదువుతున్న టైంలో.. ఓరోజు కూడా హరిరామ్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక భయపడిపోయి స్కూలు మానేసింది. కానీ, తల్లిదండ్రులకు జరిగింది చెప్పలేకపోయింది.

తాజాగా ఈ నెల 5న అదే స్కూల్‌లో చదువుతున్న సదరు బాలిక చెల్లెలిపైనా అదే పీఈటీ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ విషయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పి వాపోయింది. దీంతో పెద్దమ్మాయి కూడా తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలిజేసింది. దీంతో ఆ పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలికల స్టేట్ మెంట్ తీసుకున్నారు. సదరు దుర్మార్గుడి చేతిలో ఇంకెంత మంది విద్యార్థులు మోసపోయారన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసు వివరాలను పంచోరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అబ్దుల్ రౌఫ్ తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement