ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతో కీలకమైనవి. అందుకే ఈ పరీక్షలను మిస్సవ్వకూడదని భావిస్తారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ముగ్గురు ప్రమాదం బారినపడినా పరీక్షలను ఎంతో ధైర్యంగా రాశారు.
జైపూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరారు. అయితే దారిలో వారి బైక్ ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేందుదుకు ఆ విద్యార్థులు ఉదయం 7:45 గంటలకు బైక్‌పై బయలుదేరారు. అయితే సెంటర్‌కు చేరుకునేలోగా వారి బైక్‌ను ప్రయాణికుల వ్యాన్ ఢీకొంది. దీంతో ఆ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే వారిని స్థానికులు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వారి గాయాలకు డ్రెస్సింగ్ చేశారు. అదే పరిస్థితిలో వారు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అక్కడి ఉపాధ్యాయులను అభ్యర్థించాక వారికి అందుకు అనుమతిచ్చారు. వారి కాళ్ల నుంచి రక్తం కారుతున్నా వారు పరీక్ష రాయడం విశేషం. తరువాత వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ విద్యార్థుల ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలియజేస్తూ ఈ విద్యార్థులు ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వారని తెలిపారు. వీరిని మన్‌పురా మచాడీ నివాసి లోకేష్ యాదవ్, ఉదయపురియా నివాసి అంకిత్ గుర్జార్, ఏకలవ్య ఫుల్వాడియాగా గుర్తించారు. ముగ్గురూ ఒకే బైక్‌పై పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రయాణికులు వాహనం వీరి బైక్‌ను ఢీకొన్నదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment