Horrific
-
ప్రమాద గాయాలతోనే పరీక్షలకు..
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతో కీలకమైనవి. అందుకే ఈ పరీక్షలను మిస్సవ్వకూడదని భావిస్తారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ముగ్గురు ప్రమాదం బారినపడినా పరీక్షలను ఎంతో ధైర్యంగా రాశారు. జైపూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరారు. అయితే దారిలో వారి బైక్ ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేందుదుకు ఆ విద్యార్థులు ఉదయం 7:45 గంటలకు బైక్‌పై బయలుదేరారు. అయితే సెంటర్‌కు చేరుకునేలోగా వారి బైక్‌ను ప్రయాణికుల వ్యాన్ ఢీకొంది. దీంతో ఆ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వారి గాయాలకు డ్రెస్సింగ్ చేశారు. అదే పరిస్థితిలో వారు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అక్కడి ఉపాధ్యాయులను అభ్యర్థించాక వారికి అందుకు అనుమతిచ్చారు. వారి కాళ్ల నుంచి రక్తం కారుతున్నా వారు పరీక్ష రాయడం విశేషం. తరువాత వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విద్యార్థుల ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలియజేస్తూ ఈ విద్యార్థులు ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వారని తెలిపారు. వీరిని మన్పురా మచాడీ నివాసి లోకేష్ యాదవ్, ఉదయపురియా నివాసి అంకిత్ గుర్జార్, ఏకలవ్య ఫుల్వాడియాగా గుర్తించారు. ముగ్గురూ ఒకే బైక్‌పై పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రయాణికులు వాహనం వీరి బైక్‌ను ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. -
మణిపూర్ నుంచి మరో ఘోరం వెలుగులోకి!
ఇంఫాల్: మణిపూర్‌లో శాంతిభద్రతలు ఒకమోస్తరుగా అదుపులోకి వస్తున్న క్రమంలో.. గత మూడు నెలల కాలంలో చోటు చేసుకున్న నేరాలు-ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక శిబిరానికి చేరుకున్న ఓ వివాహిత తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. బాధితురాలి కథనం ప్రకారం.. చురాచందాపూర్ జిల్లాలో కొందరు దుండగుల చేతుల్లో ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. అత్యంత పాశవికంగా వేధిస్తూ మరీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు వాళ్లు. ఈ క్రమంలో బయటికి చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతో ఇన్నాళ్లూ ఆమె మౌనంగా ఉండిపోయింది. అయితే ఆ లైంగిక దాడి తర్వాత ఆమె ఆరోగ్యంగా బాగా దెబ్బతింది. ఆమె మంగళవారం ఓ ప్రభుత్వాసుపత్రిని సందర్శించగా.. అక్కడి వైద్యులు జరిగిందంతా తెలుసుకుని ఆమెకు వైద్యంతో పాటు మనోధైర్యం అందించారు. ఆపై బుధవారం ఆమె బిష్ణుపూర్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (జీరో ఎఫ్ఐఆర్ అంటే.. బాధితులు ఏ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు కావొచ్చు. నేరం జరిగిన స్టేషన్ పరిధిలోనే ఫిర్యాదు చేయాలనే రూల్ లేదు. ఆ తర్వాత నేరం జరిగిన పరిధిలోకి ఆ ఎఫ్ఐఆర్ను పంపిస్తారు.) బాధితురాలి ఆవేదన.. మే 3వ తేదీ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో.. కొందరు దుండగులు మా ప్రాంతంలోని ఇళ్లను తగలబెట్టారు. ఈ క్రమంలో నేను ఉంటున్న ఇల్లు కాలిపోతుండగా.. ప్రాణభయంతో నేను(37) నా ఇద్దరు కొడుకుల్ని, నా భర్త సోదరి ఆమె ఇద్దరు బిడ్డలతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించాం. నా అల్లుడిని వీపున వేసుకుని.. ఇద్దరు కొడుకులతో సహా పారిపోయే యత్నం చేశాం. ఆ సమయంలో కింద పడిపోయా. ముందు చంటిబిడ్డతో పరిగెడుతున్న నా భర్త సోదరి వెనక్కి వచ్చి తన బిడ్డనూ, నా ఇద్దరు బిడ్డలను తీసుకుని పరుగులు తీసింది. కిందపడ్డ నేను పైకి లేవలేకపోయా. ఆ సమయంలో ఐదారుగురు దుండగులు చుట్టుముట్టారు. నా బిడ్డలు అరుస్తూ నావైపు చూస్తూనే పారిపోసాగారు. ఆ కీచకులు లైంగికంగా వేధిస్తూ.. నాపై దాడికి పాల్పడ్డారు. మృగచేష్టలతో తీవ్రంగా గాయపడిన నేను.. ఆ తర్వాత శరణార్థ శిబిరంలో ఉన్న నా వాళ్లను చేరుకున్నా. ఆ గాయం నన్ను మానసికంగా ఎంతో కుంగదీసింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆరోగ్యం దిగజారడంతో వైద్యుల్ని సంప్రదించగా.. వాళ్లకు విషయం చెప్పాల్సి వచ్చింది. వాళ్ల సలహా మేరకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నాకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా అని బాధితురాలు తన ఆవేదనను పంచుకుంది. ఇదిలా ఉంటే.. మణిపూర్ అల్లర్లు-హింస కారణంగా మే 3వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకు 6,500దాకా కేసులు నమోదు చేసినట్లు మణిపూర్‌పోలీస్ శాఖ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. వీటిలో ఇళ్ల ధ్వంసం కేసులే ఎక్కువగా ఉన్నట్లు సుప్రీంకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అయితే పోలీస్ శాఖ వివరణతో సంతృప్తి చెందని సుప్రీం.. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో కేసుల విచారణ జరిపించాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిచింది. మరోవైపు గత నెలలో మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి మరీ లైంగిక దాడి జరిపిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. -
సీబీఐ చేతికి.. మణిపూర్ మహిళలను ఊరేగించిన కేసు..!
ఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీపీఐ)కి అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. గత మూడు నెలలపాటు మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన పలు కేసులను రాష్ట్రం వెలుపల కూడా విచారణ జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో రెండు జాతుల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి. గత మూడు నెలలుగా అల్లర్లలో అమానవీయ ఘటనలు ఎన్నో జరిగాయి. మహిళలపై అత్యాచారాలు, లూఠీలు, దొంగతనాలు, సహా దారిదోపిడీల వరకు అనేక కేసులు పలు పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అల్లర్లలో ఆందోళనకారులు దేశమంతా తలదించుకునే సంఘటన మే 3న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకొచ్చింది. ఇద్దరు మహిళలను అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. అటు రాజకీయంగా కూడా దుమారాన్ని రేపింది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిందించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే మణిపూర్ ఈ దుస్థితికి చేరిందని ఆరోపించాయి. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని పట్టుబడుతున్నాయి. గత వారం రోజులుగా ఈ అంశంపైనే పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదీ చదవండి: కెమెరా సాక్షిగా మణిపూర్‌లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి.. -
ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్!
ప్రపంచంలో నేరాలు చేసేందుకు నేరస్తులు వివిధ మార్గాలను ఎన్నుకుంటుంటారు. కొందరు నేరస్తులు ఫోనులో బెదిరిస్తే, మరికొందరు నేరం చేసేముందు ఏదో ఒక సూచన చేస్తారు. అయితే ఇటీవల ఒక మహిళకు ఎదురైన అనుభవం ఆమెకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన ఈ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్ మాధ్యమంలో అందరికీ తెలియజేసింది. ఆ మహిళ తన అనుభవాన్ని ఎఫ్బీలో తెలియజేస్తూ..‘కొద్దిరోజుల క్రితం మా ఇంటి లెటర్ బాక్స్‌పై ఎరుపు రంగు గుర్తులు కనిపించాయి. మరోమారు కూడా ఇంటి సైడ్ గేట్ దగ్గర మళ్లీ ఇటువంటి గుర్తులే కనిపించాయి. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఇంటి రెండవ గేటు తెరచివుంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. దీనిపై నాలో ఆందోళన మొదలయ్యింది. ఆ గేటు కొంచెం కష్టంమీద తెరవాల్సి ఉంటుంది. అయినప్పటికీ గాలి కారణంగానే ఆ గేటు తెరుచుకుని ఉంటుందని భావిస్తున్నాను. ఎవరి ఇంటి దగ్గరైనా ఇటువంటి చిహ్నాలు కనిపించాయా? ఎవరికైనా ఇటువంటి అనుభవం ఎదురయ్యిందా?’ అని ఆమె నెటిజన్లను ప్రశ్నించింది. సదరు మహిళ ఈ పోస్టు విషయంలో ఎంతో సస్పెన్స్ మెయింటైన్ చేసింది. దీనిని స్పందించిన ఒక యూజర్ ‘మీ ఇంటిలోని కుక్కలను తీసుకుపోయేందుకు ఎవరో దొంగ ఈ చిహ్నాలు వేశాడని’ రాశారు. ఇటువంటి గుర్తులను కుక్కలను ఎత్తుకుపోయేవారు వేస్తుంటారని విన్నానని, మీ కుక్కలను జాగ్రత్తగా కోవాలంటూ ఆయన సలహా ఇచ్చారు. కొంతమంది యూజర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని, గేటుకు తాళం వేయాలని సలహా ఇచ్చారు. కాగా ఆ మహిళ తన ఇంటి బయట ఉన్న గుర్తులకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక ఫొటోపై నాలుగు ఎర్రని సమాంతర రేఖలు ఉండగా, మరో ఫొటోపై ఎన్టీ ఆని రాసివుంది. మరో ఫొటోపై ఎస్ అని రాసి వుంది. దీనికి స్పందించిన ఒక యూజర్ ఎన్టీ అంటే ‘నో థ్రెట్’ ఎస్ అంటే సెక్యూరిటీ ఉందని పేర్కొన్నారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఈ సమాచారాన్ని తెలియజేసింది. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
సుత్తితో ఆవుల తలపై మోది..
మాంసాన్ని ఎగుమతి చేసేందుకు జంతువులను అత్యంత క్రూరంగా చంపుతున్నట్లు చూపించే ఓ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. స్లెడ్జింగ్ సుత్తులతో ఇద్దరు వియత్నామీలు ఆవులను వధిస్తున్నట్లు చూపుతున్న ఈ వీడియోలో కనికరం లేకుండా ఆవుల తలపై సుత్తితో మోది మరీ వాటిని చంపుతున్నారు. దీంతో ఆ భయానక పరిస్థితులను తట్టుకోలేక.. పక్కనే వధకు సిద్ధంగా ఉన్న జీవాలు కళ్లు తిరిగి పడిపోయాయి. రక్తసిక్తంగా ఉన్న వధ గదిలో కట్టె గుంజలకు వధకు తెచ్చిన ఆవులను కట్టేశారు. అలా కట్టిన వాటి తలమీద సుత్తితో తీవ్రమైన వేగంతో అది మరణించే వరకూ ఆపకుండా కొట్టడంతో మొదట ఆ మూగజీవం ముందరికాళ్లను కిందకు వంచేసింది. ఆ తర్వాత బాధను భరించలేక పెద్దగా అరుస్తూ నేలకూలింది. దీంతో ఉలిక్కిపడిన పక్కనే ఉన్న మరో ఆవు ఒక్క దెబ్బ కూడా కొట్టకముందే కుప్పకూలిపోయింది. కాగా, ఇలా చంపిన ఆవు మాంసాన్ని వీరు ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తారు. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయిన తర్వాత స్పందించిన ఆస్ట్రేలియా, వియత్నాం ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాయి.