ప్రపంచంలో నేరాలు చేసేందుకు నేరస్తులు వివిధ మార్గాలను ఎన్నుకుంటుంటారు. కొందరు నేరస్తులు ఫోనులో బెదిరిస్తే, మరికొందరు నేరం చేసేముందు ఏదో ఒక సూచన చేస్తారు. అయితే ఇటీవల ఒక మహిళకు ఎదురైన అనుభవం ఆమెకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన ఈ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్‌బుక్ మాధ్యమంలో అందరికీ తెలియజేసింది.
ఆ మహిళ తన అనుభవాన్ని ఎఫ్‌బీలో తెలియజేస్తూ..‘కొద్దిరోజుల క్రితం మా ఇంటి లెటర్ బాక్స్‌పై ఎరుపు రంగు గుర్తులు కనిపించాయి. మరోమారు కూడా ఇంటి సైడ్ గేట్ దగ్గర మళ్లీ ఇటువంటి గుర్తులే కనిపించాయి. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఇంటి రెండవ గేటు తెరచివుంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. దీనిపై నాలో ఆందోళన మొదలయ్యింది.
ఆ గేటు కొంచెం కష్టంమీద తెరవాల్సి ఉంటుంది. అయినప్పటికీ గాలి కారణంగానే ఆ గేటు తెరుచుకుని ఉంటుందని భావిస్తున్నాను. ఎవరి ఇంటి దగ్గరైనా ఇటువంటి చిహ్నాలు కనిపించాయా? ఎవరికైనా ఇటువంటి అనుభవం ఎదురయ్యిందా?’ అని ఆమె నెటిజన్లను ప్రశ్నించింది. సదరు మహిళ ఈ పోస్టు విషయంలో ఎంతో సస్పెన్స్ మెయింటైన్ చేసింది. దీనిని స్పందించిన ఒక యూజర్ ‘మీ ఇంటిలోని కుక్కలను తీసుకుపోయేందుకు ఎవరో దొంగ ఈ చిహ్నాలు వేశాడని’ రాశారు. ఇటువంటి గుర్తులను కుక్కలను ఎత్తుకుపోయేవారు వేస్తుంటారని విన్నానని, మీ కుక్కలను జాగ్రత్తగా కోవాలంటూ ఆయన సలహా ఇచ్చారు.
కొంతమంది యూజర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని, గేటుకు తాళం వేయాలని సలహా ఇచ్చారు. కాగా ఆ మహిళ తన ఇంటి బయట ఉన్న గుర్తులకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక ఫొటోపై నాలుగు ఎర్రని సమాంతర రేఖలు ఉండగా, మరో ఫొటోపై ఎన్‌టీ ఆని రాసివుంది. మరో ఫొటోపై ఎస్ అని రాసి వుంది. దీనికి స్పందించిన ఒక యూజర్ ఎన్‌టీ అంటే ‘నో థ్రెట్’ ఎస్ అంటే సెక్యూరిటీ ఉందని పేర్కొన్నారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఈ సమాచారాన్ని తెలియజేసింది. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్‌ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ..
Comments
Please login to add a commentAdd a comment