ఎవరైనా సరే తమకు సంబంధించిన ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే సమస్యల్లో పడతారు. ఇటువంటి నేపధ్యంలోనే అస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.
ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో..
బాలీ విమానాశ్రయం అధికారులు ఒక ఆస్ట్రేలియా యువతి దగ్గరున్నది ‘డర్టీ పాస్‌పోర్ట్’ అని ఆరోపిస్తూ, రూ. 1000 డాలర్లు వసూలు చేశారు. అధికారులు ఆమె దగ్గరున్న ‘డర్టీ పాస్ట్‌పోర్ట్’ను స్వీకరించలేమని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ రిపోర్టును అనుసరించి 28 ఏళ్ల యువతి తన తల్లితోపాటు సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఇండోనేషియా వెళుతోంది. బాటిక్ ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె దగ్గరున్న పాస్‌పోర్ట్ పాతబడిపోవడంతో ఆమె కొత్తగా ఒక ఫారం నింపాల్సి వచ్చింది.
7 సంవత్సరాల క్రితంనాటిది కావడంతో..
ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెచేత ఒక ప్రత్యేకమైన నీలిరంగు ఫారం మీద సంతకం చేయించారు. దానిని తనతో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ పత్రానికి సంబంధించిన ప్రక్రియతోపాటు ఇమిగ్రేషన్ పూర్తయిన తరువాత వారికి విమానం ఎక్కేందుకు అనుమతి లభించింది. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం ఆ పాస్‌పోర్ట్ 7 సంవత్సరాల క్రితంనాటిది. దీంతో అది కాస్త మురికిగా తయారయ్యింది.
‘నన్ను ఎగతాళి చేశారు’
ఆమె తన అనుభవాన్ని వివరిస్తూ ‘మాకు నిజమైన ఇబ్బంది బాలీ ఎయిర్‌పోర్టులో ఎదురయ్యింది. బాలీ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌కు ముందు అధికారులు నన్ను గంటపాటు ప్రశ్నించారు. వారు నన్ను చూసి నవ్వారు. చట్టాన్ని అతిక్రమించానని ఆరోపించారు. నా పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయ్యిందంటూ ఎగతాళి చేశారు. 1000 డాలర్లు కడితే నా సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో పాస్‌పోర్ట్ తిరగి ఇవ్వబోమని తెలిపారు.
పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వబోమంటూ..
ఇటీవలే నేను ఉద్యోగాన్ని కోల్పోవడం వలన అంత మెత్తం చెల్లించలేనన్నాను. వెంటనే అధికారులు మా అమ్మతో మాట్లాడి, తన డర్టీ పాస్‌పోర్ట్ చెల్లుబాటుకు అనుమతినివ్వాలంటే 1000 డాలర్లు చెల్లించాలని మరోమారు తెలిపారు. అయితే ఆమె కూడా ఇందుకు సమ్మతించలేదు. దీంతో అధికారులు తన పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వబోమని హెచ్చరించారు. మరోమార్గం లేక అధికారులకు వారు అడిగినంత మొత్తం చెల్లించామని, అప్పుడు తమ ప్రయాణానికి ఏర్పడిన ఆటంకం తొలగిపోయిందని’ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్‌కే షాక్!
‘ఈ ‘డర్టీ పాస్‌పోర్ట్’ పాస్ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!
Published Mon, Jul 17 2023 7:38 AM | Last Updated on Mon, Jul 17 2023 8:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment