NAGAUR
-
రాజస్థాన్‌లో భారీగా బయటపడ్డ లిథియం నిక్షేపాలు.. ఇక చైనాకు చెక్ పడ్డట్టే!
జైపూర్: అత్యంత ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు రాజస్తాన్‌లో భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో డేగానా(నాగౌర్)లోని రెన్వాత్ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), మైనింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్తాన్‌లో అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మన దేశ అవసరాల్లో 80 శాతం అవసరాలను రాజస్తాన్‌లోని నిల్వలు తీర్చగలవని అన్నారు. భారత్ లిథియం కోసం ప్రధానంగా చైనాపై ఆధారపడుతోంది. తాజాగా బయటపడిన నిల్వలతో చైనా గుత్తాధిపత్యానికి తెరపడడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోనే ఈ ఖనిజం ఉంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీలో లిథియం ఉపయోగిస్తున్నారు. -
Crime News: నాలుగేళ్ల కిందట అక్కపై! ఇప్పుడు చెల్లిపై..
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు బడులు. అందులో టీచర్లే మార్గదర్శకులు. అలాంటిది తరగతి గదిలోనే.. విద్యార్థినులపై అత్యాచారాలు చేస్తున్న ఓ కామాంధుడి బాగోతం వెలుగుచూసింది. నాలుగేళ్ల వ్యవధితో అక్కాచెల్లెలు అయిన విద్యార్థినులపై అత్యాచారం చేయడంతో.. ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఆ మృగాన్ని కటకటాల వెనక్కి నెట్టి తమలాంటి బాధితులకు న్యాయం చేయాలంటూ పోరాడుతోంది. రాజస్థాన్ నాగోర్ పట్టణంలోని పంచోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల స్టేట్మెంట్ ప్రకారం.. సదరు కుటుంబంలోని పెద్దమ్మాయి 2018లో 9వ తరగతి చదువుతుండగా ఓ రోజు పీఈటీ హరిరామ్ (30) ఆమెను ఖాళీ తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు. మళ్లీ 10వ తరగతి చదువుతున్న టైంలో.. ఓరోజు కూడా హరిరామ్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక భయపడిపోయి స్కూలు మానేసింది. కానీ, తల్లిదండ్రులకు జరిగింది చెప్పలేకపోయింది. తాజాగా ఈ నెల 5న అదే స్కూల్లో చదువుతున్న సదరు బాలిక చెల్లెలిపైనా అదే పీఈటీ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ విషయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పి వాపోయింది. దీంతో పెద్దమ్మాయి కూడా తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలిజేసింది. దీంతో ఆ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలికల స్టేట్ మెంట్ తీసుకున్నారు. సదరు దుర్మార్గుడి చేతిలో ఇంకెంత మంది విద్యార్థులు మోసపోయారన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసు వివరాలను పంచోరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అబ్దుల్ రౌఫ్ తెలియజేశారు. -
అత్యాచారం జరిగిన ఆరు రోజులకు! ‘అద్భుతం’ అనుకులోపే..
మృగాడి చేతిలో ఛిద్రమైన ఆ సోదరి.. ఆరు రోజులపాటు కారడవిలో అలాగే ఉండిపోయింది. ఆకలి, దప్పికలు లేక అల్లలాడిపోయింది. ప్రాణం పోయేలోపు తాను పడ్డ నరకం గురించి ఎవరికైనా చెప్పాలన్న తాపత్రయమే ఆమెకు కొన ఊపిరితో ఉంచింది. ఆమె సంకల్పానికి వైద్యులు సైతం ‘అద్భుతం’ అంటూ ఆశ్చర్యపోయారు. కానీ, ఈ లోపే నష్టం జరిగిపోయింది. రాజస్థాన్‌లో తాజాగా సంచలనం సృష్టించిన మహిళ అత్యాచార ఘటన విషాదాంతంగా ముగిసింది. 35 ఏళ్ల బాధితురాలు వారం రోజుల నరకయాతన తర్వాత తుది శ్వాస విడిచింది. ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి వెంటిలేటర్ మీదే చికిత్స పొందుతోందని, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడడంతో ఆమె బ్రెయిన్ ఆక్సిజన్‌ను తీసుకోవడం కష్టంగా మారిందని, చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బాధితురాలు కన్నుమూసిందని నాగౌర్ ఎస్పీ రామ్ మూర్తి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మిస్సింగ్.. దర్యాప్తుపై నిరసనలు ఫిబ్రవరి 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు.. తిరిగి రాలేదు. దీంతో అంతా వెతికిన కుటుంబ సభ్యులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేకుండా పోయింది. ఈ కేసును దర్యాప్తు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూ వచ్చారు నాగౌర్ పోలీసులు. దీంతో గ్రామస్తులు రోడ్డెక్కి రహదారిని మూసేయడంతో ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు పోలీస్ యంత్రాగం కదిలింది. ఈలోపు.. ఫిబ్రవరి 10వ తేదీన అదే గ్రామం శివారులోని అడవిలో ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా గాయాలతో.. అచేతనంగా పడి ఉండడం కొందరు గుర్తించారు. అయితే ఆమె కొన ఊపిరితో ఉందని ఆస్పత్రికి తరలించారు. మైనర్ సాయంతో మృగాడు.. అది దట్టమైన అడవి ఏరియా.. అలా ఆమె అన్నేసి రోజులు స్పృహ లేకుండా ఉండడం పోలీసులను, డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే ఆమెను మంచి చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆమె ఇచ్చిన వాంగ్మూలంతో.. నిందితుడిని, అతనికి సహకరించిన ఓ మైనర్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేయగలిగారు. ఫిబ్రవరి 4వ తేదీన ఇంటికి బయలుదేరిన ఆమెను.. ఓ మైనర్ పిలగాడి సాయంతో ఆటోలో కిడ్నాప్ చేశాడు దుండగుడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బండరాయితో ఆమెపై దాడి చేసి.. చనిపోయిందనుకుని దూరంగా అడవిలో ఆమె శరీరాన్ని విసిరేసి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు ఆమె వాంగ్మూలం సాయంతోనే పోలీసులు నిందితుడిని, సహకరించిన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు నాగౌర్ ఎస్పీ. -
ఇండియన్ షకీరా..12 రోజులపాటు బంధించినా వెనక్కి తగ్గలేదు!
కొలంబియా పాప్ సింగర్, డ్యాన్సర్ షకీరా పాడుతూ చేసిన డ్యాన్స్‌ను టీవీలో చూసింది తొమ్మిదేళ్ల తస్లీమా బానో. ఆ డ్యాన్స్ బాగా నచ్చడంతో ఎంతోఆసక్తిగా గమనించి స్టెప్పులను గుర్తుపెట్టుకుంది. ఒకరోజు వాళ్ల ఇంటికి దగ్గరలో జరుగుతున్న కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ చేస్తుంటే తస్లీమా కూడా డ్యాన్స్ చేసింది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు విపరీతంగా కోపడ్డారు. ‘‘ఇంకోసారి డ్యాన్స్ చేశావంటే ఊరుకోము’’ అని హుకుం జారీ చేశారు. అయినా వినలేదు. దీంతో పన్నెండురోజులపాటు ఒక గదిలో పెట్టి బంధించారు. అయినా తస్లీమా వెనక్కి తగ్గలేదు. తనలోని ప్రతిభతో అందరి మన్ననలు పొందడమేగాక తన తండ్రి మనసు గెలుచుకుని, ఏకంగా ఇండియన్ షకీరాగా ఎదిగింది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో చెందిన నూర్ మహ్మద్, బేగం దంపతుల ముద్దుల కూతురు తస్లీమా భానో. అమ్మవాళ్లు డ్యాన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించడంతో.. మొదట్లో వాళ్లకు ఎదురు చెప్పలేక వెనక్కు తగ్గింది తస్లీమా. ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకసారి స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో తస్లీమా డ్యాన్స్పోటీలో పాల్గొంది. మిగతా వారికంటే బాగా డ్యాన్స్ చేయడంతో మొదటి బహుమతి గెలుచుకుంది. అంతేగాక ఆ కార్యక్రమాన్ని చూసిన వారంతా తస్లీమాను చప్పట్లు, అభినందనలతో ముంచెత్తారు.స్కూలు టీచర్లు తనలోని డ్యాన్స్ ప్రతిభను తెగపొగిడేశారు. అక్కడకు వచ్చిన నూర్ మహ్మద్ ఇవన్నీ చూసి.. ‘ఇంతటి ప్రతిభను మేము ప్రోత్సహించకుండా వద్దన్నామా?’ అని గ్రహించి, అప్పటి నుంచి తస్లీమా డ్యాన్స్ చేయడాన్ని ప్రోత్సహించేవారు. కానీ అమ్మకు మాత్రం ఏ మాత్రం ఇష్టం ఉండేదికాదు. అలా తస్లీమా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ‘గోరీ నాఛే’ నుంచి.. ‘గోరీ’గా మారింది తండ్రి ప్రోత్సాహంతో చిన్నచిన్న కార్యక్రమాలలో తన డ్యాన్స్‌లతో అలరించేది తస్లీమా. సాఫీగా సాగిపోతున్న డ్యాన్స్ జర్నీలో ఒక పెద్ద కుదుపు ... 2010లో నూర్‌మహ్మద్ మరణించాడు. హఠాత్తుగా జరిగిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన తస్లీమా ఏడాది పాటు డ్యాన్స్ ప్రపంచాన్ని వదిలేసింది. షాక్ నుంచి కోలుకున్నాక మళ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. రాజస్థానీ పాట ‘లే ఫొటు లే’ తస్లీమాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత చేసిన ‘గోరీ నాఛే నాగోరీ నాఛే’ పాట రాజస్థాన్‌లోనే సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కపాటతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయింది. కొంతమంది స్టార్ల పేర్లు మారినట్టే.. అభిమానులంతా గోరీ నాగోరీగా పిలుస్తూ తస్లీమాపేరునే మార్చేశారు. ఏ ప్రదర్శనకు వెళ్లినా గోరీ అనిపిలుస్తూ.. ముందు ‘నాగోరీ’ పాటకు డ్యాన్స్ చేయాలని డిమాండ్ చేసేవారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక పాపులర్ పాటలకు స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ, ఇతర డ్యాన్సర్ల కంటే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. రాజస్థాన్‌తోపాటు హర్యాణా, ఢిల్లీ, యూపీలలో తస్లీమాకు మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. నటుడు, ర్యాపర్, సింగర్, డ్యాన్సర్, ప్రొడ్యూసర్‌గా హర్యాణాలో పాపులర్ అయిన సన్నీ చౌదరీతో కలిసి కొన్ని డ్యాన్స్ వీడియోలు చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాది విడుదలైన ‘ఘఘరో’ సాంగ్ ఒక్కరోజులో 16 మిలియన్ల వ్యూస్‌తో రీజనల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రతిభ ఉండాలేగానీ ఎంత పెద్దఅడ్డంకి అయినా మన ‘ఎదుగుదల’ను ఆపలేదని తస్లీమా డ్యాన్స్ జర్నీ స్ఫూర్తినిస్తోంది. -
మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. ఐదుగురు కలిసి ఇంట్లో బంధించి..
జైపూర్: రాజస్థాన్‌లో మైనర్ బాలికపై ఇంటి పక్కనే ఉండే కొందరు యువకులు అఘాత్యానికి పాల్పడ్డారు. పనికోసం వెళ్లిన ఆ బాలిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమెకు మాయమాటలు చెప్పారు. అంతటితో ఆగకుండా.. ఆ బాలికను నమ్మించి సాముహిక అత్యాచారం చేశారు. గత గురువారం (ఆగస్టు26)న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నాగౌర్ జిల్లాలో జరిగింది. కాగా, 16 ఏళ్ల మైనర్ బాలిక.. పనికోసం తన ఇంటి పక్కన ఉండే హరిప్రసాద్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో రామేశ్వర్, తన మిత్రులతో కలిసి ఇంట్లో ఉన్నాడు. వారు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత బాలికను ఒక గదిలో బంధించారు. వారంతా కలసి బాలికపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా.. విషయం ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు తన ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో.. బాలిక గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడికి గురవ్వటాన్ని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో యువతిని కారణం అడిగారు. ఆ తర్వాత యవతి జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తనపై ఐదురుగు యువకులు అత్యాచారం చేశారని కన్నీటి పర్యంత మయ్యింది. వెంటనే బాధితురాలి తండ్రి, తన కూతురితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు తెలిపారు. మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని నాగౌర్ పోలీసు అధికారి రామేశ్వర్ లాల్ పేర్కొన్నారు. చదవండి: ప్రియుడి కోసం బిడ్డను హింసించిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు -
ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి.. ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి
జైపూర్: రాజస్తాన్‌లోని నగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బికనీర్-జోధ్‌పూర్ రహదారిలోని శ్రీ బాలాజీ టెంపుల్ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన ఓ కారు, టక్కు పరస్పరం ఢీకొనడంతో 11 మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బికనీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులంగా మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రాజస్తాన్‌లోని రామ్‌దేవరా కర్నీ మాత దేవాలయాలను దర్శించుకొని తిరిగి ఇంటికి బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి ప్రమాద ఘటనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. మధ్యప్రదేశ్‌కు తిరుగు ప్రయాణమైన 11 మంది యాత్రికులు నగౌర్‌లోని శ్రీబాలాజీ పట్టణం వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం.. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఈ కష్ట సమయంలో దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’అని గెహ్లాట్ పేర్కొన్నారు. బాధితులకు నష్టపరిహారం రాజస్తాన్ రోడ్డు ఘటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. కాగా నాగౌర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ గ్రేషియా సహాయాన్ని ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రుల వైద్యానికి అవసరమయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించనుందని వెల్లడించారు. -
విషాదం : ఎద్దును తప్పించబోయి..
జైపూర్ : రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. హైవేపై వెళ్తున్న మినీ బస్సుకు ఎదురుగా వచ్చిన ఎద్దును తప్పించబోయి చెట్టును బలంగా డీకొట్టడంతో 12 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాతూర్ నుంచి హర్యానాలోని హిసార్‌కు వెళ్లేందుకు శుక్రవారం మద్యాహ్నం మినీ బస్సులో 22మంది బయలుదేరారు. ఈ నేపథ్యంలో మినీ బస్సు నాగౌర్ జిల్లాలోని కచ్‌మన్ జాతీయ రహదారి వద్దకు రాగానే ఒక ఎద్దు ఎదురుగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఎద్దును తప్పించడానికి సడెన్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే బస్సు ఓవర్‌స్పీడ్ ఉండడంతో అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌తో సహ 12 మంది మృతి చెందగా వారిలో ఆరుగురు మహిళలున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని స్ధానికుల సాయంతో మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. కాగా మిగతా 10 మందిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని జైపూర్‌లోని ఎస్‌మ్మెఎస్ ఆసుపత్రికి తరలించగా, మిగతావారిని నాగౌర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మానసిక స్థితి బాగోలేని మహిళపై దాష్టీకం
జైపూర్: రాజస్థాన్‌లో కొందరు ఆకతాయిలు వీరంగం సృష్టించారు. మానవత్వం అనే పదానికి అర్థం మరిచిపోయి తమ ఇష్టరీతిగా ప్రవర్తించారు. మానసిక స్థితి బాగాలేని మహిళని ఆకతాయిలు బావబాదిన ఘటన నాగౌర్‌లో ఆలస్యంగా చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు నాగౌర్ డీఎస్పీ ఓం ప్రకాశ్ గౌతమ్ తెలిపారు. ఆ వివరాలు.. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో గత మంగళవారం ప్రకాశ్, శ్రావణ్ సహా మరో యువకుడు బైక్‌పై వెళ్తున్నారు. ఇంతలోనే రోడ్డు పక్కన బైకును నిలిపారు. మానసిక స్థితి సరిగాలేని మహిళ వద్దకు ముగ్గురు యువకులు వెళ్లారు. ఇందులో ఇద్దరు యువకులు 'జై శ్రీరామ్', 'జై హనుమాన్' అని నినాదాలు చేయాలని సూచించగా.. మహిళ త్వరగా స్పందించలేదు. వెంటనే వీరిలో ఇద్దరు యువకులు పైపులతో ఆ అభాగ్యురాలిని చితకబాదారు. మానవత్వం మరిచిన ఆ యువకులు.. వారు చెప్పిన పదాల్ని గట్టిగా నినదించే వరకు మానసిక స్థితి బాగాలేని మహిళను పైపులతో కొట్టడాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఓం ప్రకాశ్ చెప్పారు. జూన్ 13న ఈ ఘటన జరిగిందని, ఈ కేసుకు సంబంధించి నిందితులు ప్రకాశ్, శ్రావణ్ లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు. -
మహిళల పోరుకు దన్నుగా ఆరెస్సెస్
నాగౌర్(రాజస్థాన్): మహిళలకు ఆరెస్సెస్ దన్నుగా నిలిచింది. తమకు అన్ని ఆలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతించాలని వారు చేస్తున్న డిమాండ్‌కు ఆరెస్సెస్ మద్దతు తెలిపింది. గత కొన్ని రోజులుగా నానుతున్న ఈ సమస్యపై స్పందిస్తూ దీనికి చర్చలు, పరస్పర అవగాహన ఒప్పందాలే పరిష్కార మార్గమని స్పష్టం చేసింది. అంతేకాకుండా మతపరమైన అంశాల్లో మహిళలు, పురుషులు సమానమే అంటూ కూడా ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అసలు శబరిమలవంటి ఆలయాల్లోకి వారిని ఎందుకు అనుమతించడం లేదో, ఆ ఆలయాలకు ఉన్న సాంప్రదాయాలేమిటో అనే కారణాలను కూడా ఆరెస్సెస్ సంబంధిత జర్నల్ తెలిపింది.