
మహిళల పోరుకు దన్నుగా ఆరెస్సెస్
నాగౌర్(రాజస్థాన్): మహిళలకు ఆరెస్సెస్ దన్నుగా నిలిచింది. తమకు అన్ని ఆలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతించాలని వారు చేస్తున్న డిమాండ్కు ఆరెస్సెస్ మద్దతు తెలిపింది. గత కొన్ని రోజులుగా నానుతున్న ఈ సమస్యపై స్పందిస్తూ దీనికి చర్చలు, పరస్పర అవగాహన ఒప్పందాలే పరిష్కార మార్గమని స్పష్టం చేసింది.
అంతేకాకుండా మతపరమైన అంశాల్లో మహిళలు, పురుషులు సమానమే అంటూ కూడా ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అసలు శబరిమలవంటి ఆలయాల్లోకి వారిని ఎందుకు అనుమతించడం లేదో, ఆ ఆలయాలకు ఉన్న సాంప్రదాయాలేమిటో అనే కారణాలను కూడా ఆరెస్సెస్ సంబంధిత జర్నల్ తెలిపింది.