Women devotees
-
ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం
‘నా పేరు నందిని. మాది కోదాడ. కుటుంబంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చాను. పావు గంటలో అమ్మవారి దర్శనం అవుతుందని చెప్పడంతో రూ.500 టికెట్లు తీసుకున్నాం. క్యూ లైన్లోకి వచ్చి గంటన్నర గడచినా చిన గాలిగోపురం వద్దే పోలీసులు నిలిపేశారు. టికెట్లు కొనని వారిని మాత్రం పంపించారు. ఇదేం అన్యాయం అని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను పంపిస్తూ టికెట్లు కొన్న భక్తులను గంటల తరబడి నిలబెట్టేశారు’. ఇది ఒక్క నందిని అభిప్రాయమే కాదు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల అందరి విమర్శ.విజయవాడస్పోర్ట్స్: ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడో తేదీన దసరా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొండను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని భక్తులతో పాటు, ఉత్సవ విధులకు హాజరైన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తొలి రోజు నుంచే పోలీసుల దౌర్జన్యంపై పలువురు అధికారులు, సిబ్బంది తమ శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. మంగళవారం పోలీసుల తీరు మరింత శృతిమించడంతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై ఎన్నడూ లేని విధంగా నల్ల రిబ్బన్లతో నిరసనలు కొనసాగాయి. అన్నింటా వారే.. పోలీస్‌శాఖ అధికారులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించిన తరువాత దసరా ఉత్సవాలు ప్రారంభం కావడం కొన్నేళ్లగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అమ్మవారు తమ ఆడపడుచని, ఉత్సవం తమదేననే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దసరా ఉత్సవాలకు దేవదాయ శాఖ 1,200 మంది, మునిసిపల్ 1,500 మంది, ఎన్సీసీ 400 మంది, రెవెన్యూ 300 మంది, వైద్య–ఆరోగ్య 250 మంది, అగి్నమా పక శాఖ 150 మంది అధికారులు, సిబ్బందిని ఉత్సవాలకు కేటాయించగా. పోలీస్ శాఖ మాత్రం ఆరు వేల మందిని కొండ చుట్టూ మోహరించింది. భక్తులకు అవసరమైన సేవలను దేవదాయ, రెవెన్యూ, మునిసిపల్, ఎన్సీపీ, వైద్య ఆరోగ్య శాఖలు అందిస్తుంటే రక్షణ పేరుతో వచ్చిన పోలీసులు పెత్తనం చెలాయిస్తున్నారు. మహామంటపం దిగువనున్న లిఫ్ట్‌ను పూర్తిగా స్వాదీనం చేసుకుని తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మినహా ఎవరినీ లిఫ్ట్‌లోకి అనుమతించడం లేదని, క్యూ లైన్ సజావుగా సాగకుండా నిరంతరం అడ్డుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజే దేవదాయ శాఖ ఇంజినీర్‌ను పోలీసులు అడ్డుకుని జులుం ప్రదర్శించారు. దీంతో సదరు ఉద్యోగి మహామంటపం కింద పోలీసుల కోసం వేసిన టెంట్లు, కురీ్చలను తొలగించేశారు. ఈ పంచాయితీ రాష్ట్ర సచివాలయం అధికారులు వరకు వెళ్లింది. లిఫ్ట్‌ల వద్ద పోలీసులు చేస్తున్న అతికి నిరసనగా అదే లిఫ్ట్‌ల వద్దే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను డంప్ చేస్తున్నారు. ఓం రింగ్ నుంచి ప్రొటోకాల్ వరకు వెళ్లకుండా ఓ న్యాయమూర్తిని పోలీసులు ఇబ్బంది పెట్టారు. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి సదరు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రూ.500 టిక్కెట్లు కొన్న భక్తులను నిలిపివేసి, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పోలీసులు పంపించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్, వినాయకుడి గుడి, ఘాట్‌రోడ్డు గాలిగోపురం ప్రాంతాల్లో తమను నిలిపివేస్తున్నారని, ఆలయంపై వరకు బైక్‌లను అనుమతించడం లేదని, తమను ఆలయంలోకి వెళ్లనీయడంలేదని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు అసభ్యకరంగా ఉందని పోలీస్ కమిషనర్ వద్ద పలువురు మహిళలు వాపోయారు. ఉత్సవ సేవా కమిటీలో ఉన్న తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నల్ల రిబ్బన్లతో నిరసన ఖాకీల తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు మంగళవారం ఆందోళనకు దిగారు. మీడియా పాయింట్ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరసన కొనసాగింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వస్తున్నారని తెలుసుకున్న పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు హుటా హుటిన మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. మీడియా పాయింట్ నుంచే డీజీపీ అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. డీజీపీ వెళ్లే సమయంలో పోలీస్ శాఖకు వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు నినాదాలు చేస్తే పరువు పోతుందని గ్రహించి, వారితో చర్చలు జరిపారు. డీసీపీ గౌతమి సాలి తీరు సరిగ్గా లేదని సీపీకి మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మీడియా వాళ్లను కొండపైకి అనుమతించవద్దని డీసీపీ పదేపదే ఆదేశాలిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని సీపీ హామీ ఇవ్వడంతో మీడియా ప్రతినిధులు నిరసన విరమించారు. ఆ వెంటనే అదే మార్గంలో డీజీపీని అమ్మవారి దర్శనానికి సీపీ వెంట బెట్టుకుని వెళ్లారు. -
చెయ్యికి పాము చుట్టినా.. భక్తిపారవశ్యంతో చిందులు
వైరల్: దేవుడిపై భక్తి, నమ్మకం ఉండాలి. కానీ, అది గుడ్డిగా ఉండకూడదు!. భక్తి పేరుతో మూఢనమ్మకాలను ప్రమోట్ చేయడం, అంధ విశ్వాసంతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తరచూ చూస్తున్నాం కూడా. అయితే.. తాజాగా మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ బార్డర్‌లోని ఓ గ్రామంలో జరిగిన ఆసక్తికర ఘటన ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. చిన్‌ద్వారా జిల్లా జామ్ సవాలీ హనుమాన్ ఆలయం.. ఆ చుట్టుపక్కల 11 జిల్లాల్లో బాగా ఫేమస్. ఎందుకంటే ఆ ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకుని ఉన్న పొజిషన్లో ఉంటుంది. సంజీవని పర్వతం మోసుకెళ్లే సమయంలో.. ఆయన అక్కడ సేదతీరాడని నమ్మకం. అంతేకాదు విగ్రహ నాభి నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. ఆ నీటిని తీర్థంలా స్వీకరిస్తే.. మానసిక జబ్బులు తగ్గిపోవడంతో పాటు దెయ్యాలు, దుష్టశక్తులు వదిలిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం, సాయంత్రం మహా హారతి వేళ అలాంటి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంటుంది. అయితే.. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ఒక ఘటన జరిగింది. హరతి సమయంలో భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నాగుపాము ఒక భక్తురాలి చేతికి చుట్టుకుంది. అయితే ఆ పరిణామంతో ఆమె బెదరలేదు. పైగా ఆ పాము అలా ఉండగానే పైకి లేచింది. భక్తిపారవశ్యంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చిందులేసింది. అది చూసి భయంతో కొందరు దూరం జరిగారు. మరికొందరు స్వామివారి నినాదాలు చేస్తూ ఊగిపోయారు. అదేం విచిత్రమో.. ఆ పాము కూడా ఆమెను ఏం చేయలేదు. కాసేపటికి చెయ్యి నుంచి దిగిపోయి.. తన మానానా తాను బయటకు వెళ్లిపోయింది. ఈ ఆలయంలో ఈ తరహా అద్భుతాలు తరచూ జరుగుతుంటాయని, అంతా స్వామివారి మహిహేనని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్తున్నారు. महाराष्ट्र, मध्य प्रदेश के बॉर्डर पर स्थित सौंसर के जामसवली मंदिर में कोबरा प्रजाति का सांप हाथो मे लेकर महाआरती करती महीला, pic.twitter.com/5wNBiHAvPX — Yogendraindiatv (@indiatvyogendra) March 9, 2023 -
‘నేను కళావతిని కాదు..’
శబరిమల : నేను మగాడినండి బాబు.. అంటూ రిపోర్టర్ల ముందు మొరపెట్టుకుంటున్నాడు తమిళనాడుకు చెందిన 47 ఏళ్ల పరంజ్యోతి. పాపం ఈ పేరే అతన్నిప్పుడు ఇబ్బందుల్లో పడేసింది. విషయం ఏంటంటే.. శుక్రవారం కేరళ ప్రభుత్వం 51 మంది.. 50 ఏళ్ల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ సుప్రీం కోర్టుకు నివేదిక అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో కొందరు మగవారి పేర్లను కూడా చేర్చడంతో ప్రస్తతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. పాపం ఈ లిస్ట్‌లో పరంజ్యోతి పేరు కూడా వుంది. దాంతో నేను మగాడినండి బాబు అంటూ రిపోర్టర్ల ముందు వాపోతున్నాడు పరంజ్యోతి. పాండిచ్చేరికి చెందిన శంకర్ పరిస్థితి మరి దారుణం. ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళల పేర్లలో ‘కళావతి’ అనే ఆమె ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ‘కళావతి’ పేరు పక్కన ట్యాక్సీ డ్రైవర్ శంకర్ ఫోన్ నంబర్‌ను రాశారు. దాంతో గత రెండు రోజులుగా అతని ఫోన్ నిరంతరాయంగా మొగుతూనే ఉందంట. తమిళనాడుకు చెందిన గృహిణి షీలాది మరోక కథ. ఆమె వయసు 52 సంవత్సరాలు. కానీ కోర్టుకిచ్చిన లిస్ట్‌లో షీలా పేరు కూడా ఉంది. షీలాతో పాటు మరి కొంతమంది మహిళలు లిస్ట్‌లో తమ పేర్లు కూడా ఉన్నాయంటూ మీడియా ముందుకు వచ్చారు. తమ వయసు 50 సంవత్సరాలకు పైనే అని .. కానీ కోర్టుకిచ్చిన లిస్ట్‌లో తమ పేర్లు చేర్చారని సదరు మహిళలు తెలిపారు. అయితే లిస్ట్‌లో జరిగిన అవకతవకల గురించి కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు సమాచారంతో కేరళ ముఖ్యమంత్రి సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
మహిళల పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ప్రవేశించి హిందూ సంస్ధల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందు అమ్మిని తమకు 24 గంటల పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్లను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. కన్నూర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిలువరిస్తూ హిందూ సంఘాలకు చెందిన నిరసనకారులు అడ్డుకున్నారు. అయ్యప్ప ఆలయంలోకి తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ వీరు నిరవధిక దీక్షకు దిగడం కలకలం రేపింది. మరోవైపు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై ఆగ్రహిస్తూ కనక దుర్గపై ఆమె అత్త కర్రతో దాడి చేసింది. దీనిపై ఐపీసీ సెక్షన్ 341, 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా అయ్యప్ప ఆలయంలోకి ఇరువురు మహిళలు దుర్గ, బిందులు ప్రవేశించడంతో ఆలయ ప్రధాన పూజారి ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేయడం వివాదాస్పదమైంది. -
శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు
-
శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు
తిరువనంతపురం : శబరిమల ఆలయానికి పోలీస్ భద్రతతో వెళుతున్న ఇద్దరు మహిళలను సోమవారం ఉదయం ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆందోళనకారులు అడ్డగించారు. 50 సంవత్సరాల లోపు ఉన్న ఇద్దరు మహిళలను ఆందోళనకారులు చుట్టుముట్టి ముందుకు వెళ్లకుండా నిరోధించారు. పెద్దసంఖ్యలో నిరసనకారులు గుమికూడటంతో మహిళల భద్రత కోసం మరిన్ని బలగాలను పంపాలని పోలీసులు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం. కాగా ఆదివారం పదకొండు మంది మహిళా భక్తులతో కూడిన బృందాన్ని తోటి భక్తులు ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసు భద్రత ఉన్నప్పటికీ మహిళా భక్తులు వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తాము ఆందోళనకారులను బలవంతంగా చెదరగొట్టలేమని, ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉందని పంబలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ స్పెషల్ ఆఫీసర్ షాజి సుగుణన్ పేర్కొన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం అయ్యప్ప దర్శనానికి వస్తున్న మహిళలను బీజేపీ, ఆరెస్సెస్ సహా పలు హిందూ సంఘాలు, సంస్థల కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డగిస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంటోంది. -
ఆ దర్గాలో మహిళల ప్రవేశంపై నేడు హైకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని హజ్రత్ నిజూముద్దీన్ దర్గాలోనికి మహిళ ప్రవేశం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించనుంది. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకుని దర్గాలో మహిళలను అనుమతించాలని పూణేకు చెందిన న్యాయ విద్యార్ధినులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 27న తాము దర్గాను సందర్శించేందుకు వెళ్లగా దర్గా వెలుపల మహిళలకు ప్రవేశం లేదని నోటీసు అతికించారని పిటిషన్లో వారు పేర్కొన్నారు. దర్గాలోనికి మహిళల ప్రవేశాన్ని అనుమతించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులతో పాటు దర్గా నిర్వహణ కమిటీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. మహిళల ప్రవేశాన్ని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయాలని కోరారు. నిజాముద్దీన్ దర్గా బహిరంగ ప్రదేశమని, మసీదులోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం లింగ వివక్షగా పరిగణించాలని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ముంబైలోని హజి అలీ దర్గా, అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాల్లో మహిళలను అనుమతిస్తున్న ఉదంతాలను పిటిషన్లో వారు ప్రస్తావించారు. -
ఆ తీర్పే సుప్రీం..
కొచ్చి : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చికి చెందిన గోవింద్ మధుసూధన్ బెయిల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిరసనలు తెలపడం సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని పేర్కొంది. శబరిమల వద్ద సమ్మెలు చేపట్టడం సమ్మతం కాదని అక్కడ మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే క్రమంలో అరెస్ట్ అయిన నిరసనకారుల్లో ఒకరైన కొచ్చి నివాసి మధుసూధన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మధుసూధన్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు 3500 మంది నిరసనకారులను అరెస్ట్ చేయగా, వీరిలో 540 మందిపై కేసు నమోదు చేశారు. దాదాపు 100 మంది వరకూ ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించే లక్ష్యంతో బీజేపీ గురువారం రథయాత్రను ప్రారంభించింది. ఇక ఈ వివాదాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ విపక్ష కాంగ్రెస్ సైతం కాసర్గాడ్, అలప్పుజ, తిరువనంతపురంల నుంచి యాత్రలను ప్రారంభిస్తోంది. -
ఈ ఆలయంలో మహిళలకు నో ఎంట్రీ..
సాక్షి, కోల్‌కతా : శబరిమల వివాదం నేపథ్యంలో కోల్‌కతాలోని ఓ కాళికామాత ఆలయంలోనూ మూడు దశాబ్ధాలకు పైగా మహిళలకు ప్రవేశం కల్పించని ఉదంతం వెలుగుచూసింది. ఆలయ ప్రాంగణంలోకి మహిళలను అనుమతించే విషయంలో శబరిమల ఆలయ కమిటీ తరహాలోనే పంచముంద కాళీ పూజా కమిటీ కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా తాంత్రిక పూజలు నిర్వహించే పంచముంద కాళీ పూజ సమయంలో మహిళలను ఆలయ పరిసరాల్లోకి అనుమతించరని, వారి నీడను కూడా తాకనీయమని ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యుడు గంగారాం షా వెల్లడించారు. గత 34 ఏళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతున్నదన్నారు. నవంబర్ 6న కాళీ పూజను నిర్వహిస్తారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్‌లో ఈ ఆలయంలో మహిళలకు ప్రవేశం ఉంటుందా లేక నిరసనలకు కేంద్ర బిందువవుతుందా అనేది చూడాల్సి ఉంది. -
నిరసనల శబరిమల
పంబా: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున మహిళా భక్తుల అడ్డగింపుల పర్వం ఐదో రోజూ కొనసాగింది. ఆదివారం ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆరుగురు తెలుగు మహిళా భక్తులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలమ్మ(47) అనే మహిళ కుటుంబంతో కలసి శబరిమల కొండ ఎక్కుతుండగా సన్నిధానం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే 4 కిలోమీటర్ల మేర కొండ ఎక్కి వచ్చిన ఆమెను చుట్టుముట్టి వయసు ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు చూపాల్సిందిగా కోరారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాలమ్మ స్పృహ కోల్పోయారు. దీంతో వెంటనే ఆమెను అంబులెన్స్‌లో పంబాలోని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు బంధువులతో వచ్చిన 40 ఏళ్ల వయసు ఉన్న మరో ఇద్దరు మహిళా భక్తులను కూడా కొండపైకి రానివ్వకుండా ఆందోళనకారులు నిలువరించారు. దీంతో పోలీసులు వారిరువురిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం నిలక్కల్ బేస్ క్యాంప్‌నకు వచ్చిన ఆ ఇద్దరు ఆలయ సాంప్రదాయాన్ని అతిక్రమించటానికి తాము ఇక్కడికి రాలేదని రాతపూర్వకంగా తెలిపారు. వారిరువురిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాసంతి (41), ఆదిశేషి (42)గా గుర్తించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రెహానా ఫాతిమాను ఇస్లాం నుంచి బహిష్కరించినట్లు కేరళ ముస్లిం జమాత్ మండలి వెల్లడించింది. -
శబరిమల వివాదం : హిందూ సంఘాలపై స్వామి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ సంస్థలు, నిరసనకారులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ‘సుప్రీం కోర్టు ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అది తమ సంప్రదాయమని హిందువులు చెబుతున్నారని, ట్రిపుల్ తలాక్ కూడా సంప్రదాయమేనని, కానీ దాన్ని రద్దు చేసిన తర్వాత అందరూ స్వాగతించారని, హిందువులు కూడా ఇదే మాదిరి వ్యవహరించా’లని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇది హిందూ పునరుజ్జీవానికి, తిరోగమనానికి మధ్య సాగుతున్న పోరాటమని అభివర్ణించారు. హిందువులందరూ ఒకటేనని, కుల వ్యవస్థ రద్దు కావాలని హిందూ పునరుజ్జీవ శక్తులు కోరుతున్నాయన్నారు. బ్రాహ్మణులు ప్రస్తుతం కేవలం మేథావులుగానే మిగిలిపోలేదని, వారు సినిమా, వ్యాపారం తదితర రంగాల్లోనూ ఉన్నారని చెప్పుకొచ్చారు. పుట్టుకతోనే కులం నిర్ధారణ అవుతుందని ఎక్కడ రాశారని, శాస్ర్తాలను సవరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశాన్ని హిందూ నిరసనకారులు అడ్డగిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. -
శబరిమలలో భారీ భద్రత
నీలక్కల్ : శబరిమల ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని నిరసనకారులు అడ్డుకుంటున్న క్రమంలో ఆలయ ప్రవేశ ద్వారం ఉన్న నీలక్కల్ పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. పంబా బేస్ క్యాంప్ సమీపం నుంచే నిరసనకారులు 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి రాకుండా అడ్డగిస్తున్నారు. నీలక్కల్, పంబా బేస్ క్యాంప్‌ల వద్ద 200 మంది మహిళా పోలీసులతో సహా వేయి మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. సన్నిధానం వద్ద 500 పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి అన్ని వయసుల మహిళలతో భక్తులందరికీ శబరిమల ఆలయ పోర్టల్ మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది.మరోవైపు నీలక్కల్లో శబరిమల అచార్య సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనకారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాన్ని పోలీసులు తొలగించారు. భక్తులను శబరిమల వెళ్లకుండా ఎవరైనా అడ్డుకుంటే ఉపేక్షించేంది లేదని, కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు. పంబా వైపు వెళుతున్న వాహనాలను పరిశీలించి, మహిళా భక్తులను అడ్డుకుంటున్న నిరసనకారులపై తీవ్ర చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు దంపతులను నిరసనకారులు అడ్డుకోగా వారిని పోలీసులు సురక్షితంగా పంబకు చేర్చారు. కాగా టీవీ న్యూస్ ఛానెళ్ల ప్రతినిధులను సైతం నీలక్కల్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా నిరసనకారులు కోరారు. ఆ ప్రాంతంలో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించిన అనంతరం మీడియా ప్రతినిధులు తిరిగి తమ విధుల్లో నిమగ్నమయ్యారు. హిందూ సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని శివసేన హెచ్చరించింది. శబరిమల వెళ్లే భక్తులను అడ్డుకునేందుకు ఎవరినీ అనుమతించమని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. -
నీ గుడి ముందే నిలిచాను స్వామీ... ఇయ్యరా దర్శనమూ!
దేవుడు వరమిచ్చినా..పూజారి లోపలికి రమ్మన్నా..దర్శన భాగ్యానికి అడ్డుగా నిలుస్తున్న ఆచారాల కారణంగా మహిళలు శబరిమల ఆలయం బయటే ఉండిపోవలసి వస్తుందా? నేడు అయ్యప్ప గుడి తలుపులు తెరుచుకుంటున్నాయి. శ ‘రణ’ ఘోషలో స్వామివారు ఈ భక్తురాళ్ల వేడుకోలును వింటాడా? దిక్కుతోచని స్థితి సాధారణంగా ప్రకృతి విలయాలప్పుడు ఉంటుంది. అప్పుడు దేవుడే దిక్కు అనుకుంటాడు మనిషి. ఇటీవలి వరదల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ.. ప్రస్తుతం మరో ‘విలయానికి’ సిద్ధంగా ఉంది. అది ‘దేవ విలయం’! దేవుడు సృష్టించిన విలయం అని కాదు. దేవుడి చుట్టూ మనుషులు సృష్టించుకుంటున్న విలయం! శబరిమల ఆలయంలోని అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక.. ఆ తీర్పుపై అయ్యప్ప భక్తులు ‘ఒకటిగా’ విడిపోయారు. దీనర్థం ఏమిటంటే.. స్త్రీ, పురుష భక్తులు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలను, ప్రగతివాదులను విభేదించి ఒక పక్కకు వచ్చేయడం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నవారికి, సమర్థిస్తున్నవారికి మధ్య పోరు మొదలై.. మేఘాలకు పేరైన కేరళను ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.విలయంలో మనిషికి దేవుడే దిక్కయినట్లు.. ఇప్పుడీ యుద్ధస్థితిలోనూ దేవుడు మనిషికి మార్గం చూపించగలడా? చూపించినా మనిషి చూడగలడా? నేడు శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇందులో విశేషం ఏమీ లేదు. ప్రతి నెలా పూజల కోసం ఐదు రోజులు గుడి తలుపుల్ని తెరిచినట్లే ఈసారీ తెరుస్తున్నారు. అయితే ఎప్పటిలా భక్తులకు నెమ్మదైన మనసుతో అయ్యప్పను దర్శించుకునే భాగ్యం ఉంటుందా అన్నది సందేహం. గర్భగుడిలోకి వెళ్లేందుకు భక్తులు మొదట ‘పంపా’ ప్రాంతానికి చేరుకోవాలి. శబరిమల శిఖరానికి బేస్క్యాప్ (ఎక్కే చోటు) అది. అక్కడి నుంచి కొండ ఎక్కుతూ ఆలయం ఉండే ‘నిలక్కల్’కు చేరుకోవాలి. అయితే ఈ రెండు చోట్లకు ఇప్పటికే భక్తుల కన్నా ఎక్కువ సంఖ్యలో దాదాపు 30 వరకు రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన కార్యకర్తలు చేరుకున్నారు. వీళ్లందరి ధ్యేయం ఒక్కటే. ఆలయ దర్శనం కోసం వచ్చే 10–50 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీలను నిరోధించడం. తిరిగి వెనక్కు పంపించడం! శబరిమలకు ఆత్మాహుతి దళం ఆలయంలోకి వెళ్లనివ్వకుండా మహిళల్ని అడ్డుకోవడం.. సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కుకు భంగం కలిగించే చర్య. అయితే పై సంస్థల వాళ్లెవరూ తీర్పును నేరుగా వ్యతిరేకించడం లేదు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం తీర్పును సమర్థించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్లలో ఎక్కువ శాతం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతుండగా.. స్థానిక ‘శివసేన’ కార్యకర్తలు, ‘అయ్యప్ప ధర్మసేన’ సభ్యులు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రుతుక్రమ వయోపరిమితి మధ్య ఉన్న మహిళల్ని ఆలయంలోకి అనుమతించేది లేదని అంటున్నారు. శివసేన అయితే.. ఆలయ ఆచారాలను అతిక్రమించి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించే వారిని అడ్డుకునేందుకు ఏడుగురు సభ్యుల ఆత్మాహుతి దళాన్ని ఇప్పటికే శబరిమలకు పంపినట్లు ప్రకటించింది కూడా! ‘‘పంపాను దాటనివ్వం. ఒకవేళ ఆ స్త్రీలు దాటారంటే మా కార్యకర్తల మృతదేహాల మీదుగానే కొండపైకి ఎక్కాలి’’ అని సేన నాయకుడు పెరింగమల అజి అంటున్నారు. తృప్తి దేశాయ్ అయినా సరే.. ఆచారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు (మహిళాభక్తులు సహా) ప్రదర్శనలు జరుపుతున్న నేపథ్యంలో జెండర్ కార్యకర్త తృప్తి దేశాయ్ తను శబరిమలను దర్శించి తీరుతానని, మహిళల ప్రాథమిక హక్కులను ఎవ్వరూ అడ్డుకోజాలరని ముంబైలోని ఒక మలయాళం టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన ఆమె పేరును ప్రస్తావించారు. అంతకుముందు తృప్తి దేశాయ్‌ని ఉద్దేశించే.. మలయాళ నటుడు కొల్లం తులసి (69).. శబరిమలను దర్శించే సాహసం చేసే ఏ మహిళనైనా రెండు ముక్కలుగా చీల్చేస్తాని అనడం తీవ్ర వివాదాస్పదం అయింది. కొండ కింద మానవ కంచె! శివసేనతో పాటు, అయ్యప్ప ధర్మసేన కూడా గట్టిగానే ఉంది. ధర్మసేనకు రాహుల్ ఈశ్వర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో మరణించిన శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరరు మహేశ్వరరు మనవడే రాహుల్ ఈశ్వర్. ఆయన కూడా మíß ళల్ని అడ్డుకునేందుకు కొండ కింద ఒక మానవ కంచెను నిర్మిస్తున్నారు. ఈయనదీ శివసేన మాటే. కొండపై ఆలయానికి వెళ్లేందుకు నాలుగు ప్రధాన మార్గారంభాలు ఉన్నాయి. ‘‘ఆ నాలుగు చోట్లా మావాళ్లు ఉంటారు. వాళ్లకై వాళ్లు.. ఈ ఆచారాలను అతిక్రమించాలని చూసే మహిళల్ని భౌతికంగా ఏమీ అనరు. అయితే.. ఆ మహిళలు మా మృతదేహాలను దాటుకుంటూ వెళ్లాలి. మాది గాంధీ మార్గం’’ అంటున్నారు రాహుల్. నిలక్కల్‌లో సత్యాగ్రహం భారతీయ జనతా పార్టీ కూడా ఇదే దారిలో ఉంది. అయ్యప్పస్వామి జన్మస్థలంగా భావిస్తున్న పందరం నుంచి రాష్ట్ర సచివాలయానికి ఇటీవల యాత్ర జరిపిన బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శబరిమలకు కూడా నిరసన యాత్ర చేపట్టబోతోంది. పార్టీ మహిళా విభాగం ‘మహిళా మోర్చా.. ఈ నేడు (అక్టోబర్ 17) నిలక్కల్‌లో సత్యాగ్రహానికి కూర్చొంటోంది. బీజేపీ, అనుబంధ పార్టీల డిమాండ్ ఒక్కటే.. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వెయ్యాలని. లేదా తీర్పును శూన్యీకరించేలా ఒక ఆర్డినెన్స్ తేవాలని. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఇందుకు సిద్ధంగా లేరు. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై ఆయన సుముఖంగా ఉన్నారు. శబరిమల ఆలయం ‘ట్రావంకూర్ దేవస్వమ్ బోర్టు’ పరిధిలోకి వస్తుంది. బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ కూడా అన్నివర్గాల వారినీ ఆహ్వానించి, ఏకాభిప్రాయాన్ని సాధించడానికి తను చేయగలిగింది చేస్తున్నారు. మహిళా పోలీసుల సహాయం ఐదు రోజుల పూజల కోసం అక్టోబర్ 17న శబరిబల ఆలయ ద్వారాలు తెరుస్తున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చని ఇంటిలిజెన్స్ వర్గాలు కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఏం చెయ్యాలన్న దానిపై పోలీస్ యంత్రాంగం ఏ విధమైన కార్యాచరణను సిద్ధం చేసిందో బయటికి వెల్లడించడం లేదు. ఈ ఐదు రోజుల పూజ తర్వాత.. కొద్ది రోజుల్లోనే అయ్యప్పల సీజన్ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే 500 మంది మహిళా పోలీసులతో ఈ మహిళా భక్తుల సమస్యను నివారించవచ్చా అని శబరిమల ఉన్న పట్టణంతిట్ట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ టి.నారాయన్ యోచిస్తున్నారు. ఆహ్వానించిన ఆలయాల్లో అడుగుపెట్టాలి కానీ... ఆచారాలు, సంప్రదాయాలపట్ల, భగవంతుడిపట్ల భక్తి విశ్వాసాలు ఉన్నవారు వాటిని గౌరవించాలి కదా! మా గుడికి రావద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే, ఆ గుడికి స్త్రీలు వెళ్లడం అవసరమా? స్త్రీలు కూడా చూడదగ్గ ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిని సందర్శించి రావచ్చు కదా! ఎక్కడైతే ఆడవారికి ఆదరణ, గౌరవం, అభిమానం ఉంటాయో ఆ ఆలయానికి వెళ్లడం మర్యాద అనిపించుకుంటుంది. అంతేకానీ, కొన్ని వందల ఏళ్లుగా స్త్రీలు అడుగుపెట్టడం నిషేధించిన ఆలయానికి వెళ్లడం అవసరమా? ఇరువైపుల వాదనలూ ఓపిగ్గా విని, ఎవరి సంప్రదాయానికీ భంగం వాటిల్లకుండా ఉండేలా తీర్పులు ఇవ్వడం సముచితం. ఆడవాళ్లని ఎవరినీ రావద్దని అనడం లేదు. రుతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం రాకూడదని అంటున్నారు. దానిని గౌరవించి, ఆ ఆచారానికి కట్టుబడి ఉండటం సముచితం అనిపించుకుంటుందని నా అభిప్రాయం. – డా. ఎన్.అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త వారిని తక్కువ చేసినట్లు కాదు కదా! భారతదేశ సంప్రదాయంలో దేవాలయాలకు సంబంధించిన ఆగమశాస్త్రంలో ఎక్కడా స్త్రీలని కించపరచినట్టు కనిపించదు. స్వయంభూ లింగాలు, విగ్రహాలు ఉన్న ఆలయాలలో స్త్రీల విషయంలో స్పర్శదర్శనంతో సహా ఏ విధమైన అభ్యంతరమూ వ్యక్తం అయిన సందర్భాలు లేవు. తరతరాలుగా, యుగయుగాలుగా కూడా ఎక్కడా స్త్రీ పురుషులని వేరుగా చూడటం కానీ, స్త్రీలని తక్కువ చేసినట్లుగానీ లేవు.యజ్ఞోపవీతార్హత ఉన్నవారిలో కూడా.. పురుషులే యజ్ఞోపవీతం ధరిస్తారు కానీ స్త్రీలు యజ్ఞోపవీతం ధరించరు. ఏ ఆలయానికి సంబంధించిన ఆచారాలు, కట్టుబాట్లు ఆ ఆలయానికి ఉంటాయి.ప్రాంతీయాచారాలు ఉంటాయి. కొన్ని ఆలయాలు స్త్రీలకు నిషేధం ప్రకటించినట్లే, పురుషులకు ప్రవేశార్హతను నిషేధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. మనకు దేనికైనా రుషుల మాట ప్రమాణం. కొన్ని యంత్ర తంత్ర సిద్ధులతో మంత్రబద్ధం చేసి ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో స్త్రీలు ప్రవేశించకూడదన్న ఆచారం ఏళ్ల తరబడి ఉన్నప్పుడు దానిని గౌరవించడం మంచిది కదా! ఆలయంలో ప్రవేశం లేదని చెప్పినంత మాత్రాన వారిని తక్కువ చేసినట్లు భావించడం సరికాదు కదా! – మాతా రమ్యానంద భారతి, అధ్యక్షురాలు, శక్తిపీఠం -
శబరిమలపై మహిళ పోస్టు.. తీవ్ర ఉద్రిక్తత
కన్నూర్ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు అనుమతిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కోర్టు తీర్పుని కొందరు సమర్ధిస్తుండగా పలు హిందూ ధార్మిక సంస్థలు మాత్రం అయ్యప్ప ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా కోర్టు తీర్పు ఉందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తే అడ్డంగా నరికేస్తానని కేరళకు చెందిన సినీ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు కొల్లం తులసి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’) మరోవైపు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తాననీ, 18 మెట్లెక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటానని కేరళకు చెందిన రేష్మా నిశాంత్ (32) ప్రకటించారు. సుప్రీం కోర్టు 10 నుంచి 50 ఏళ్ల వయసు వారికి శబరిమల ఆలయంలోకి అనుమతి ఇచ్చినందున అయ్యప్ప దర్శనం చేసుకుంటానని ఆదివారం తన ఫేస్బుక్ అకౌంట్లో పేర్కొన్నారు. దీంతో పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఎట్టిపరిస్థితుల్లోను అమెను అయ్యప్ప ఆలయానికి వెళ్లనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నిటిపై స్పందించిన రేష్మా... మహిళగా పుట్టడం తన తప్పుకాదనీ, కోర్టు అందరికీ సమాన హక్కులుండాలనే మహిళలు శబరిమలకు వెళ్లొచ్చొనే తీర్పునిచ్చిందని తెలిపారు. పవిత్రమైన అయ్యప్ప మండల దీక్ష (41 రోజులు) ధరించినా కూడా అయ్యప్ప దర్శనం చేసుకోకుండా మహిళలను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. తను గతంలో మండల దీక్ష వేసుకున్నప్పుడు రుతుస్రావం అయిన రోజులను మినహాయించి 55 రోజులు దీక్షలో ఉన్నానని గుర్తు చేశారు. ఏదేమైనా శబరిమలలోని అయ్యప్ప దర్శనం చేసుకుంటానని స్సష్టం చేశారు. రేష్మా డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి : ‘శబరిమల’ తీర్పుపై రివ్యూ పిటిషన్లు) -
‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’
తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించే సాహసం చేసిన మహిళలను అడ్డంగా నరికేస్తానంటూ బీజేపీ మద్దతుదారుడు, సినీ నటుడు కొల్లం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల స్ర్తీలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఎన్డీయే నిర్వహించిన ర్యాలీలో తులసి ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలను నరికేసి ఒక సగం కేరళ ముఖ్యమంత్రికి మరో సగం ఢిల్లీకి పంపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (‘శబరిమల’ నిరసన హింసాత్మకం) శబరిమల దేవాలయంలోకి స్త్రీలను అనుమంతిచడమంటే అయ్యప్ప పవిత్రతని దెబ్బతీయడమేననీ, సుప్రీం తీర్పు పట్ల మహిళలే విముఖంగా ఉన్నారని తులసి వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీం తీర్పుపై నిరసనలకు తోడు ఇప్పటికే పలువురు రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే, శబరిమల తీర్పుపై అత్యవసరంగా రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. భక్తులను తొక్కుతూ లోనికి ప్రవేశించండి.. ప్రతినెల అయ్యప్పకు పూజలుంటాయి. వచ్చే బుధవారం (అక్టోబర్ 17) జరిగే పూజా కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొంటారు. దేవాలయంలో భక్తులందరు నేలపై పడుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే.. నేలపై పడుకున్న భక్తులను చెప్పులతో, బూట్లతో తొక్కుతూ.. లోనికి వెళ్లండని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ వ్యాఖ్యానించారు.(తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!) Women coming to #Sabarimala temple should be ripped in half. One half should be sent to Delhi and the other half should be thrown to Chief Minister's office in Thiruvananthapuram: Actor Kollam Thulasi, in Kollam #Kerala. pic.twitter.com/r4cL72mzJm — ANI (@ANI) October 12, 2018 -
శబరిమల తీర్పును సవాల్ చేయం..
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలో మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. శబరిమల తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయదని, ఆలయాన్ని సందర్శిఃచే మహిళా భక్తుల భద్రతకు, సౌకర్యాలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు కేరళ సహా పొరుగు రాష్ట్రాల నుంచి మహిళా పోలీసులను నియమిస్తామని చెప్పారు. శబరిమల ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లే మహిళలను ఎవరూ అడ్డుకోరని తేల్చిచెప్పారు. కాగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును పలు మహిళా హక్కుల సంస్థలు స్వాగతించగా, హిందూ సంఘాల ప్రతినిధులు తీర్పుతో విభేదించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు సైతం వ్యతిరేకిస్తోంది. -
సచ్చిదానంద్ మమ్మల్ని రేప్ చేశాడు: నలుగురు సాధ్వీలు
లక్నో: ఓ ఆశ్రమానికి చెందిన బాబా, అతని అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరుపుతూ.. చిత్రహింసలకు గురిచేశారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ ఆశ్రమంలో ప్రధాన గురువుగా ఉన్న బాబా సచ్చిదానంద్, అతని ఇద్దరు అనుచరులు తమపై అత్యాచారం జరిపారని మంగళవారం ఇద్దరు సాధ్వీలు ఆరోపించగా.. తాజాగా బుధవారం మరో ఇద్దరు సాధ్వీలు పోలీసులను ఆశ్రయించారు. సచ్చిదానంద, అతని ఇద్దరి అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరిపారని నలుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. బాధిత సాధ్వీలపై కొంతకాలంగా ఆశ్రమంలోని మహాంత్లు ఒత్తిడి తెచ్చారని, తమ లైంగిక కోరికలు తీర్చేందుకు నిరాకరించడంతో వారిని ఆశ్రమంలో బంధించి అత్యాచారం జరిపారని పోలీసుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. బస్తీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బాధితులకు వైద్యపరీక్షలు నిర్వహించామని, కేసు దర్యాప్తు జరుగుతోందని బస్తీ జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. 2008 నుంచి తాము ఆశ్రమంలో నివసిస్తున్నామని సాధ్వీలు తెలిపారు. 'నేను ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చాను. 12 ఏళ్ల వయస్సులో 2008లో నేను ఇక్కడికి వచ్చాను. అమాయకురాలిని కావడంతో నాపట్ల ఏం జరిగిదో తెలిసేది కాదు. నేను నిరాకరించినా ఇక్కడి ముగ్గురు బాబాలు నాపై అత్యాచారం జరిపారు. నన్ను బందీగా ఉంచి.. కొడుతూ,, తరచూ అత్యాచారం జరిపారు' అని ఓ సాధ్వీ తెలిపారు. -
పుష్కర ఏర్పాట్లు ఇలానా! సిగ్గు.. సిగ్గు
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమంలో కొలువైన సంగమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో మహిళా భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఆదివారం సుమారు 15 వేలకు పైగా భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు చేశారని అంచనా. అయితే, తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయింది. ప్రధానంగా పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం వస్త్రాలు మార్చుకునేందుకు మహిళలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. భర్తలు, బంధువులు.. చీరలు, పంచెలు అడ్డుగా పట్టుకుంటే తప్ప దుస్తులు మార్చుకునే పరిస్థితి లేకపోయింది. అధికారులు రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించినా.. వేలల్లో వచ్చిన భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. - ఆత్మకూరు -
మహిళల పోరుకు దన్నుగా ఆరెస్సెస్
నాగౌర్(రాజస్థాన్): మహిళలకు ఆరెస్సెస్ దన్నుగా నిలిచింది. తమకు అన్ని ఆలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతించాలని వారు చేస్తున్న డిమాండ్‌కు ఆరెస్సెస్ మద్దతు తెలిపింది. గత కొన్ని రోజులుగా నానుతున్న ఈ సమస్యపై స్పందిస్తూ దీనికి చర్చలు, పరస్పర అవగాహన ఒప్పందాలే పరిష్కార మార్గమని స్పష్టం చేసింది. అంతేకాకుండా మతపరమైన అంశాల్లో మహిళలు, పురుషులు సమానమే అంటూ కూడా ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అసలు శబరిమలవంటి ఆలయాల్లోకి వారిని ఎందుకు అనుమతించడం లేదో, ఆ ఆలయాలకు ఉన్న సాంప్రదాయాలేమిటో అనే కారణాలను కూడా ఆరెస్సెస్ సంబంధిత జర్నల్ తెలిపింది. -
మీ ఇంటిని పేల్చేస్తాం...చంపేస్తాం
-
ముగిసిన వరుణయాగం
ఘట్కేసర్ (రంగారెడ్డి జిల్లా) : ఘట్కేసర్ మండలంలోని ఏదులాబాద్‌లోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో నిర్వహిస్తున్న వరుణ యాగం సోమవారం పూర్ణ్ణాహుతితో ముగిసింది. మూడురోజుల పాటు నిర్వహించిన వరుణ యాగంలో అనేక మంది మహిళా భక్తులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వరుణ యాగం చేయడానికి దేవాలయ ధర్మకర్త కంట్లం శంకరప్ప సంకల్పించడం చాల మంచిదన్నారు. దీంతో సకల జీవరాసులకు మేలు కలుగుతుందన్నారు. ముగింపు కార్యక్రమంలో బలిహరణ చేసి పూర్ణాహుతి నిర్వహించారు. -
మహిళా భక్తులపై లైంగికదాడికి యత్నం
నిందితుల్లో అధికార పార్టీ కౌన్సిలర్ ? తాడేపల్లి రూరల్: పూజలకోసం వచ్చిన మహిళలపట్ల మద్యం సేవించిన యువకులు అసభ్యంగా ప్రవర్తించడమేగాకుండా వారిపై లైంగికదాడికి యత్నించిన సంఘటన తాడేపల్లి మండలం సీతానగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ బీటుకానిస్టేబుళ్లు వారిని రక్షించారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి గంగానమ్మపేటకు చెందిన మనుగోలు వర్మ వదినకు కొద్దికాలం నుంచి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. స్థానిక గంగానమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఆలయ పూజారి సలహా మేరకు పూజాద్రవ్యాలను కృష్ణానదిలో కలిపేందుకు ఆదివారం రాత్రి వర్మ కుటుంబ సభ్యులు ఏడుగురు తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం పెద ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చారు. పూజాద్రవ్యాలను కృష్ణానదిలో కలుపుతుండగా అక్కడికి సమీపంలో ఇసుక తిన్నెలపై మద్యం సేవిస్తున్న మందుబాబుల దృష్టి మహిళలపై పడింది. ముగ్గురు మహిళలపై వారు విచక్షణ కోల్పోయి వయసు కూడా చూడకుండా లైంగిక దాడికి యత్నించారు. వారితో వచ్చిన పురుషులు కూడా అడ్డుకోలేకపోయారు. అటుగా వస్తున్న బీటు కానిస్టేబుళ్లు వీరి కేకలు విని అక్కడకు వెళ్లి మహిళలను రక్షించారు. ఈ మేరకు బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందుబాబులు తమ వద్ద నుంచి 17 వేల రూపాయల నగదు, మూడు సవర్ల నానుతాడు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సకాలంలో పోలీసులు రాకపోతే బంధువుల ఎదుటే తమపై లైంగికదాడి చేసి, హత్య చేసి ఉండేవారని రోదిస్తూ తెలిపారు. నిందుతుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన మునిసిపల్ కౌన్సిలర్ కుమారుడని తెలియవచ్చింది. పోలీసుల అదుపులో ఐదుగురు ఈ సంఘటనపై ఎస్ఐ వినోద్‌కుమార్ మాట్లాడుతూ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 333, 341, 323, 364, 356, 384, 149 ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో మహానాడుకు చెందిన అల్లాబక్షు, ఎ.స్వామి, అంజిరెడ్డి కాలనీకి చెందిన పద్మారవి, విజయవాడ గిరిపురానికి చెందిన ఖాజా, కత్తుల తులసీకృష్ణ ఉన్నారని చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.