శబరిమల ఆలయానికి పోలీస్ భద్రతతో వెళుతున్న ఇద్దరు మహిళలను సోమవారం ఉదయం ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆందోళనకారులు అడ్డగించారు. 50 సంవత్సరాల లోపు ఉన్న ఇద్దరు మహిళలను ఆందోళనకారులు చుట్టుముట్టి ముందుకు వెళ్లకుండా నిరోధించారు. పెద్దసంఖ్యలో నిరసనకారులు గుమికూడటంతో మహిళల భద్రత కోసం మరిన్ని బలగాలను పంపాలని పోలీసులు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం.