![Woman Devotee Dance After Snake Wrap Her Hand Video Viral - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/03/10/Woman-Devotee.jpg.webp?itok=_xHSnULW)
వైరల్: దేవుడిపై భక్తి, నమ్మకం ఉండాలి. కానీ, అది గుడ్డిగా ఉండకూడదు!. భక్తి పేరుతో మూఢనమ్మకాలను ప్రమోట్ చేయడం, అంధ విశ్వాసంతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తరచూ చూస్తున్నాం కూడా. అయితే.. తాజాగా మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ బార్డర్‌లోని ఓ గ్రామంలో జరిగిన ఆసక్తికర ఘటన ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
చిన్‌ద్వారా జిల్లా జామ్ సవాలీ హనుమాన్ ఆలయం.. ఆ చుట్టుపక్కల 11 జిల్లాల్లో బాగా ఫేమస్. ఎందుకంటే ఆ ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకుని ఉన్న పొజిషన్‌లో ఉంటుంది. సంజీవని పర్వతం మోసుకెళ్లే సమయంలో.. ఆయన అక్కడ సేదతీరాడని నమ్మకం. అంతేకాదు విగ్రహ నాభి నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. ఆ నీటిని తీర్థంలా స్వీకరిస్తే.. మానసిక జబ్బులు తగ్గిపోవడంతో పాటు దెయ్యాలు, దుష్టశక్తులు వదిలిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం, సాయంత్రం మహా హారతి వేళ అలాంటి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంటుంది.
అయితే.. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ఒక ఘటన జరిగింది. హరతి సమయంలో భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నాగుపాము ఒక భక్తురాలి చేతికి చుట్టుకుంది. అయితే ఆ పరిణామంతో ఆమె బెదరలేదు. పైగా ఆ పాము అలా ఉండగానే పైకి లేచింది. భక్తిపారవశ్యంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చిందులేసింది. అది చూసి భయంతో కొందరు దూరం జరిగారు. మరికొందరు స్వామివారి నినాదాలు చేస్తూ ఊగిపోయారు. అదేం విచిత్రమో.. ఆ పాము కూడా ఆమెను ఏం చేయలేదు. కాసేపటికి చెయ్యి నుంచి దిగిపోయి.. తన మానానా తాను బయటకు వెళ్లిపోయింది. ఈ ఆలయంలో ఈ తరహా అద్భుతాలు తరచూ జరుగుతుంటాయని, అంతా స్వామివారి మహిహేనని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్తున్నారు.
महाराष्ट्र, मध्य प्रदेश के बॉर्डर पर स्थित सौंसर के जामसवली मंदिर में कोबरा प्रजाति का सांप हाथो मे लेकर महाआरती करती महीला, pic.twitter.com/5wNBiHAvPX
— Yogendraindiatv (@indiatvyogendra) March 9, 2023
Comments
Please login to add a commentAdd a comment