వరుణ యాగంలో పూర్ణ్ణాహుతి నిర్వహిస్తున్న వేదపండితులు
ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) : ఘట్‌కేసర్ మండలంలోని ఏదులాబాద్‌లోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో నిర్వహిస్తున్న వరుణ యాగం సోమవారం పూర్ణ్ణాహుతితో ముగిసింది. మూడురోజుల పాటు నిర్వహించిన వరుణ యాగంలో అనేక మంది మహిళా భక్తులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వరుణ యాగం చేయడానికి దేవాలయ ధర్మకర్త కంట్లం శంకరప్ప సంకల్పించడం చాల మంచిదన్నారు. దీంతో సకల జీవరాసులకు మేలు కలుగుతుందన్నారు. ముగింపు కార్యక్రమంలో బలిహరణ చేసి పూర్ణాహుతి నిర్వహించారు.