తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించే సాహసం చేసిన మహిళలను అడ్డంగా నరికేస్తానంటూ బీజేపీ మద్దతుదారుడు, సినీ నటుడు కొల్లం తులసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల స్ర్తీలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఎన్డీయే నిర్వహించిన ర్యాలీలో తులసి ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలను నరికేసి ఒక సగం కేరళ ముఖ్యమంత్రికి మరో సగం ఢిల్లీకి పంపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (‘శబరిమల’ నిరసన హింసాత్మకం)
శబరిమల దేవాలయంలోకి స్త్రీలను అనుమంతిచడమంటే అయ్యప్ప పవిత్రతని దెబ్బతీయడమేననీ, సుప్రీం తీర్పు పట్ల మహిళలే విముఖంగా ఉన్నారని తులసి వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీం తీర్పుపై నిరసనలకు తోడు ఇప్పటికే పలువురు రివ్యూ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే, శబరిమల తీర్పుపై అత్యవసరంగా రివ్యూ పిటిషన్‌లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది.
భక్తులను తొక్కుతూ లోనికి ప్రవేశించండి..
ప్రతినెల అయ్యప్పకు పూజలుంటాయి. వచ్చే బుధవారం (అక్టోబర్ 17) జరిగే పూజా కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొంటారు. దేవాలయంలో భక్తులందరు నేలపై పడుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే.. నేలపై పడుకున్న భక్తులను చెప్పులతో, బూట్లతో తొక్కుతూ.. లోనికి వెళ్లండని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ వ్యాఖ్యానించారు.(తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!)
Women coming to #Sabarimala temple should be ripped in half. One half should be sent to Delhi and the other half should be thrown to Chief Minister's office in Thiruvananthapuram: Actor Kollam Thulasi, in Kollam #Kerala. pic.twitter.com/r4cL72mzJm
— ANI (@ANI) October 12, 2018
Comments
Please login to add a commentAdd a comment