రైల్వేస్టేషన్(విజయవాడ)/లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నర్సాపూర్–కొట్టాయం (07119) డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 తేదీల్లో, కొట్టాయం–నర్సాపూర్ (07120) డిసెంబర్ 3, 10, 17, 31, జనవరి 7, 14 తేదీల్లో, హైదరాబాద్–కొల్లాం (07133) డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో, కొల్లాం–హైదరాబాద్ (07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 తేదీల్లో నడుస్తాయని వివరించారు.
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం వెల్లడించారు. మచిలీపట్నం–కర్నూలు సిటీ (07067) డిసెంబర్ 1 నుంచి 31 వరకు ప్రతి శని, మంగళ, గురువారాలు, కర్నూలు సిటీ–మచిలీపట్నం (07068) డిసెంబర్ 2 నుంచి 2023 జనవరి 1 వరకు ప్రతి ఆది, బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది.
మచిలీపట్నం–తిరుపతి (07095) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో, తిరుపతి–మచిలీపట్నం (07096) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి సోమ, మంగళ, గురు, శనివారాలు, తిరుపతి–ఔరంగాబాద్ (07637) డిసెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి ఆదివారం, ఔరంగాబాద్–తిరుపతి (07638) డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–సికింద్రాబాద్ (07481) డిసెంబర్ 4 నుంచి జనవరి 29 వరకు ప్రతి ఆదివారం, సికింద్రాబాద్–తిరుపతి (07482) డిసెంబర్ 5 నుంచి జనవరి 30 వరకు ప్రతి సోమవారం నడుస్తాయి.
హైదరాబాద్–తిరుపతి (07643) డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) డిసెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, విజయవాడ–నాగర్‌సోల్ (07698) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్‌సోల్–విజయవాడ (07699) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, కాకినాడ టౌన్–లింగంపల్లి (07445) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు, లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాలు, హైదరాబాద్–నర్సాపూర్ (07631) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, నర్సాపూర్–హైదరాబాద్ (07632) డిసెంబర్ 4 నుంచి జనవరి 1 వరకు ప్రతి ఆదివారం, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (08585) డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో, మహబూబ్‌నగర్–విశాఖపట్నం (085856) డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..
Comments
Please login to add a commentAdd a comment