Special Trains details
-
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రైళ్ల వివరాలిలా.. ► సికింద్రాబాద్–బ్రాహ్మణ్‌పూర్–వికారాబాద్ (07089/07090) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ► వికారాబాద్–బ్రాహ్మణ్‌పూర్–సికింద్రాబాద్ (07091/07092) స్పెషల్ ట్రైన్ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రాహ్మణ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► విశాఖపట్టణం–కర్నూల్ (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ► శ్రీకాకుళం–వికారాబాద్ (08547/08548) స్పె షల్ ట్రైన్ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సీజన్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం పూర్ణ–తిరుపతి (07609), జనవరి 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి–పూర్ణ (07610), జనవరి 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం హైదరాబాద్–నర్సాపూర్ (07631), జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నర్సాపూర్–హైదరాబాద్ (07632), ఈనెల 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి–సికింద్రాబాద్ (07481), జనవరి 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం సికింద్రాబాద్–తిరుపతి (07482), జనవరి 1 నుంచి 31 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ పోర్టు–లింగంపల్లి (07445), జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఏజెన్సీలో హైవే -
Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు..
రైల్వేస్టేషన్(విజయవాడ)/లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్–కొట్టాయం (07119) డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 తేదీల్లో, కొట్టాయం–నర్సాపూర్ (07120) డిసెంబర్ 3, 10, 17, 31, జనవరి 7, 14 తేదీల్లో, హైదరాబాద్–కొల్లాం (07133) డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో, కొల్లాం–హైదరాబాద్ (07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 తేదీల్లో నడుస్తాయని వివరించారు. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం వెల్లడించారు. మచిలీపట్నం–కర్నూలు సిటీ (07067) డిసెంబర్ 1 నుంచి 31 వరకు ప్రతి శని, మంగళ, గురువారాలు, కర్నూలు సిటీ–మచిలీపట్నం (07068) డిసెంబర్ 2 నుంచి 2023 జనవరి 1 వరకు ప్రతి ఆది, బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది. మచిలీపట్నం–తిరుపతి (07095) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో, తిరుపతి–మచిలీపట్నం (07096) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి సోమ, మంగళ, గురు, శనివారాలు, తిరుపతి–ఔరంగాబాద్ (07637) డిసెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి ఆదివారం, ఔరంగాబాద్–తిరుపతి (07638) డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–సికింద్రాబాద్ (07481) డిసెంబర్ 4 నుంచి జనవరి 29 వరకు ప్రతి ఆదివారం, సికింద్రాబాద్–తిరుపతి (07482) డిసెంబర్ 5 నుంచి జనవరి 30 వరకు ప్రతి సోమవారం నడుస్తాయి. హైదరాబాద్–తిరుపతి (07643) డిసెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) డిసెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, విజయవాడ–నాగర్సోల్ (07698) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్సోల్–విజయవాడ (07699) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, కాకినాడ టౌన్–లింగంపల్లి (07445) డిసెంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు, లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాలు, హైదరాబాద్–నర్సాపూర్ (07631) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి శనివారం, నర్సాపూర్–హైదరాబాద్ (07632) డిసెంబర్ 4 నుంచి జనవరి 1 వరకు ప్రతి ఆదివారం, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (08585) డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో, మహబూబ్‌నగర్–విశాఖపట్నం (085856) డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
దసరా ఎఫెక్ట్: ప్లాట్‌ఫాం టికెట్ రేట్లు పెంపు.. స్పెషల్ ట్రైన్స్ ఇవే..
దసరా పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగానే కాచిగూడ రైల్వే స్టేష్లన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచింది. కాగా, పెరిగిన ధరలు నేటి(సెప్టెంబర్ 25) నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 9 తర్వాత మళ్లీ టికెట్ ధర రూ. 10కి చేరుతుంది. ఇదిలా ఉండగా.. దసర పండుగ సందర్బంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతున్నట్టు వెల్లడించింది. సికింద్రాబాద్-యశ్వంత్ పూర్, సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. Temporary Increase in Platform Ticket Price to Rs. 20/- at #Kacheguda Railway Station during #Dussehra Festival Season. The hike in platform ticket price is applicable up to 09th October, 2022. *Rail users may kindly note the same and extend cooperation. pic.twitter.com/WW7k52GrM3 — South Central Railway (@SCRailwayIndia) September 26, 2022 ప్రత్యేక సర్వీసుల వివరాలు ఇవే.. - సెప్టెంబర్ 28న.. సికింద్రాబాద్ నుంచి యశ్వంత్ పూర్. - సెప్టెంబర్ 29న.. యశ్వంత్ పూర్ నుంచి సికింద్రాబాద్. - అక్టోబర్ 9న.. తిరుపతి నుంచి సికింద్రాబాద్. - అక్టోబర్ 10న.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడుస్తుంది. Kindly note: SCR to run #Train No. 07265/66 Secunderabad- Yesvantpur-Secunderabad Special train Ex. Secunderabad on 28.09.22 and Ex. Yesvantpur on 29.09.22 under TOD(trains on demand) to clear extra rush.#SWRupdates .@DDChandanaNews pic.twitter.com/QUJY6oADaN — South Western Railway (@SWRRLY) September 26, 2022 -
ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బి) పరీక్షల కోసం సిద్ధపడుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ప్రకటనలో తెలిపారు. భద్రక్–గుంటూరు–భద్రక్ (08401/08402) భద్రక్ –గుంటూరు (08401) ఎగ్జామ్ స్పెషల్ రైలు ఈనెల 10వ తేదీ రాత్రి 9గంటలకు భద్రక్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.35 గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి ఉదయం 6.55కు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంటూరు–భద్రక్ (08402) స్పెషల్ 11వ తేదీ రాత్రి 8గంటలకు గుంటూరులో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 2.30 విశాఖ చేరుకుని, ఇక్కడ నుంచి 2.50గంటలకు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు భద్రక్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఏసీ, 5–థర్డ్ ఏసీ, 9–స్లీపర్‌క్లాస్, 4–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజీ కోచ్‌లతో నడుస్తాయి. ఈ రైళ్లు ఇరు మార్గాలలో జైపూర్ కియోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయి. చదవండి: ఏపీ టెట్–2022 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..? భువనేశ్వర్–తాంబరం–భువనేశ్వర్ (08407/08408) భువనేశ్వర్–తాంబరం (08407)ఎగ్జామ్ స్పెషల్ భువనేశ్వర్‌లో 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.15 విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి సాయంత్రం 5.35కు బయల్దేరి 12వ తేదీ ఉదయం 7.15కు తాంబరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తాంబరం–భువనేశ్వర్ (08408)స్పెషల్ 12వ తేదీ రాత్రి 10.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు 13వ తేదీ మధ్యాహ్నం 11.45కు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 12.05కు బయల్దేరి అదేరోజు రాత్రి 7గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఏసీ, 5–థర్డ్ ఏసీ, 8–స్లీపర్ క్లాస్, 2–జనరల్ సెకండ్ క్లాస్, 1–సెకండ్ క్లాస్ కం లగేజీ కం దివ్యాంగ కోచ్, 1–జనరేటర్ మోటార్కార్ కోచ్‌లతో నడుస్తాయి. ఈ స్పెషల్ ఇరుమార్గాలలో ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖ, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, చెన్నై ఎగ్మోర్ స్టేషన్లలో ఆగుతాయి. షాలిమార్–సికింద్రాబాద్– షాలిమార్(08005/08006) షాలిమార్ – సికింద్రాబాద్ (08005)ఎగ్జామ్ స్పెషల్ షాలిమార్‌లో 11వ తేదీ ఉదయం 6 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.25గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 8.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు 12వ తేదీ మధ్యాహ్నం 11కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్–షాలిమార్ స్పెషల్ సికింద్రాబాద్‌లో 14వ తేదీ మధ్యాహ్నం 2.30గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 5.20గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 5.40గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 9.20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ 1–సెకండ్ ఏసీ, 1–థర్డ్ ఏసీ, 11–స్లీపర్‌క్లాస్, 5–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజి/ దివ్యాంగ కోచ్‌లతో నడుస్తాయి. ఈ రైళ్లు ఇరుమార్గాలలో ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జాయ్పూర్ కియోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు స్టేషన్లలో ఆగుతాయి. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమల వేళ్లే ప్రమాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ► సికింద్రాబాద్–కొల్లం ప్రత్యేక రైలు (07133) ఈ నెల 18న ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07134) ఈ నెల 19న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► కాచిగూడ–కొల్లం ప్రత్యేక రైలు (07135) ఈ నెల 22న ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07136) ఈ నెల 23న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ► నాందేడ్–కొల్లం ప్రత్యేక రైలు (07137) ఈ నెల 23న ఉదయం 9.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ► కొల్లం–తిరుపతి ప్రత్యేక రైలు (07506) ఈ నెల 25న (శనివారం) మధ్యరాత్రి 12.45 గంటలకు కొల్లంలో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ► తిరుపతి–నాందేడ్ ప్రత్యేక రైలు (07138) ఈ నెల 26న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 3 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. -
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీని తగ్గించి వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య పలు పూజా స్పెషల్ రైళ్లు నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే నిర్ణయించినట్లు, వాల్తేర డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠీ తెలిపారు. చదవండి: దేత్తడి హారిక ఇల్లు ఎంత బాగుందో చూడండి! విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం(08579/18580) పూజా స్పెషల్: విశాఖపట్నం–సికింద్రాబాద్(08579 పూజా స్పెషల్ రైలు ప్రతి బుధవారం రాత్రి 7గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబర్ 1 నుండి 29వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08580)సికింద్రాబాద్‌లో త్రపి గురువారం రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగుడ, సత్తెనపల్లె స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ రైళ్లు 3–థర్డ్ ఏసీ, 8–స్లీపర్‌క్లాస్, 6–సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్ కం లగేజీ కోచ్‌లతో నడుస్తాయి. విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం(08585/08586) స్పెషల్ విశాఖపట్నం–సికింద్రాబాద్(08585) వీక్లీ పూజా స్పెషల్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంట లకు విశాఖపట్నంలో బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ డిసెంబరు 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08586) సికిందాబాద్లో ప్రతి బుధవారం రాత్రి 9.05గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబరు 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, సామర్ల కోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూ రు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఎసి, 3–థర్డ్ ఎసి, 10–స్లీపర్‌క్లాస్, 6–జనరల్ సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్ కం లగేజీ/డిజేబుల్డ్ కోచ్‌లతో నడుస్తాయి. -
దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దీపావళి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ►మచిలీపట్నం–కర్నూలు సిటీ ప్రత్యేక రైలు (07067) నవంబర్ 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30 తేదీల్లో మధ్యాహ్నం 3.50కి మచిలీపట్నంలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07068) నవంబర్ 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, డిసెంబర్ 1వ తేదీల్లో రాత్రి 8.00 గంటలకు కర్నూలు సిటీలో బయల్దేరుతుంది. ►నర్సాపూర్–సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07455) ఈ నెల 31, నవంబర్ 7, 14 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. ►సికింద్రాబాద్–విజయవాడ ప్రత్యేక రైలు (07456) నవంబర్ 1, 8, 15 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ►సికింద్రాబాద్–దానాపూర్ ప్రత్యేక రైలు (07460) నవంబర్ 7వ తేదీ ఉదయం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07459) నవంబర్ 11న ఉదయం 11.00 గంటలకు దానాపూర్‌లో బయలుదేరుతుంది. ►విశాఖపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక వారాంతపు రైలు (08579) నవంబర్ 3, 10, 17 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08580) నవంబర్ 4, 11, 18 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. -
దసరాకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రద్దీ మార్గాల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు ప్రత్యేక పూజా స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్(08579) వీక్లీ అక్టోబర్ 13, 20, 27 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7కు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08580) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 14, 21, 28 తేదీల్లో రాత్రి 7.40కు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (చదవండి: Chedi Talimkhana: గంతలు కట్టినా.. గురి తప్పదు..) విశాఖపట్నం–తిరుపతి(08583) వీక్లీ విశాఖపట్నంలో అక్టోబర్ 18, 25, నవంబర్ ఒకటి తేదీల్లో రాత్రి 7.15 బయలుదేరి.. మరుసటి రోజు ఉద యం 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08584) తిరుపతిలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో రాత్రి 9.55 బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–సికింద్రాబాద్(08585) స్పెషల్ విశాఖపట్నంలో అక్టోబర్ 19, 26, నవంబర్ 2 తేదీల్లో సాయంత్రం 5.35 బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో(08586) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 20, 27, నవంబరు 3 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతుంది. చదవండి: ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం -
రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి, పున:ప్రారంభం కానున్న రైళ్లు
కరోనా కారణంగా నిలిచిన రైళ్లు తిరిగి పున:ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే తెలిపింది. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన 24 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లు ఇప్పుడు పున:ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రద్దు చేసిన ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లు జూన్ 5, 2021 నుండి ప్రారంభం కానున్నాయి. ఇక, జూన్ 5 నుండి ఇండియన్ రైల్వే తిరిగి ప్రారంభించే ప్యాసింజర్ ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైన్ నెంబర్ 05591/05592 దర్భంగా - హర్ నగర్ డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్- 05579 దర్భంగ - జాన్ జహర్ పూర్ డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05580 జాన్ జహర్ పూర్ - దర్భాంగా డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05230/05229 సహర్సా - బర్హారా కోతి డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05238/05237 బర్హరా కోతి - బన్మాంకి డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03224/03223 రాజ్గీర్ - ఫతుహా మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03641/03642 దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ - దిల్దార్‌నగర్ జంక్షన్ స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03647/03648 దిర్దార్నగర్ - తారిఘాట్ స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03356/03355 గయా - కియుల్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05519/05520 వైశాలి - సోన్పూర్ డెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03368 సోన్పూర్ - కతిహార్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03367 కతిహార్ - సోన్ పూర్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03315 కతిహార్ - సమస్తిపూర్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 03316 సమస్తిపూర్ - కతిహార్ మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది ట్రైన్ నెంబర్ 05247/05248 సోన్ పూర్- చప్రా మెము స్పెషల్ ప్యాసింజర్ జూన్ 5, 2021 నుండి తిరిగి ప్రారంభమవుతుంది చదవండి : Covid-19 : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్..సొంతిల్లే కొనుక్కుంటాం' -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకుని నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ మేనేజర్ ఏకే త్రిపాఠి వెల్లడించారు. ఈనెల 9 నుంచి 31 వరకు విశాఖ-లింగంపల్లి మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు,ఈనెల 10 నుంచి ఫిబ్రవరి 1 వరకు లింగంపల్లి-విశాఖ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తూర్పుకోస్తా రైల్వే పేర్కొంది. -
పండగ ప్రత్యేక రైళ్ల వేళలివే..
అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నిత్యం నడిచే రైళ్లు.. లింగంపల్లి–కాకినాడ పోర్ట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్: లింగంపల్లి స్టేషన్లో రాత్రి 8.30కి బయలుదేరి మరుసటి ఉదయం 7.20కి కాకినాడ చేరుకుంటుంది. నగరం వైపు వచ్చే రైలు కాకినాడలో రాత్రి 7.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05కు లింగంపల్లి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. లింగంపల్లి–తిరుపతి లింగంపల్లిలో సాయంత్రం 5.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు తిరుపతిలో సాయంత్రం 6.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు లింగంపల్లి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, బీబీనగర్, నల్లగొండ, నడికుడి, గుంటూరు, ఒంగోలు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు.. ప్రతిరోజూ నడిచేవి తిరుపతి–అమరావతి (మహారాష్ట్ర) తిరుపతిలో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50కి అమరావతి చేరుకుంటుంది. అమరావతిలో ఉదయం 6.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి తిరుపతి చేరుకుంటుంది. రూట్:పాకాల, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపురం, కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్‌ల మీదుగా.. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 30 వరకు ప్రతిరోజూ.. లింగంపల్లి–నర్సాపూర్ లింగంపల్లిలో రాత్రి 9.05కు బయలుదేరి మరుసటి రోజు 7.45కు నర్సాపూర్ చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు నర్సాపూర్‌లో సాయంత్రం 6.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి లింగంపల్లికి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, నల్లగొండ, విజయవాడ, గుడివాడ, భీమవరం, పాలకొల్లు మీదుగా ప్రయాణిస్తాయి. -
తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ మంగళవారం నుంచి పరిమిత సంఖ్యలో నడపనుంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను రైల్వే అధికారులు ప్లాన్ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) మార్గం : బెంగళూరు–న్యూఢిల్లీ ట్రైన్ నెంబర్: 02691 సర్వీస్: డెయిలీ మధ్యలో నిలిచే స్టేషను: అనంతపురం, గుంతకల్లు జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ ప్రారంభం: 12.05.2020 మార్గం : న్యూఢిల్లీ–బెంగళూరు ట్రైన్ నెంబర్: 02692 సర్వీస్: డెయిలీ మధ్యలో నిలిచే స్టేషను: ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్, సికింద్రాబాద్ జంక్షన్, గుంతకల్లు జంక్షన్, అనంతపురం ప్రారంభం: 12.05.2020 మార్గం : చెన్నై సెంట్రల్–న్యూఢిల్లీ ట్రైన్ నెంబర్: 02433 సర్వీస్: శుక్రవారం, ఆదివారం మధ్యలో నిలిచే స్టేషన్లు: విజయవాడ, వరంగల్లు, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా ప్రారంభం: 15.05.2020 మార్గం : న్యూఢిల్లీ–చెన్నై సెంట్రల్ ట్రైన్ నెంబర్: 02434 సర్వీస్: బుధవారం, శుక్రవారం మధ్యలో నిలిచే స్టేషన్లు: ఆగ్రా, ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్, వరంగల్లు, విజయవాడ ప్రారంభం: 13.05.2020 మార్గం : సికింద్రాబాద్–న్యూఢిల్లీ ట్రైన్ నెంబర్: 02437 సర్వీస్: బుధవారం మధ్యలో నిలిచే స్టేషన్లు: నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ ప్రారంభం: 20.05.2020 మార్గం : న్యూఢిల్లీ–సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్: 02438 సర్వీస్: ఆదివారం మధ్యలో నిలిచే స్టేషను: ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్ ప్రారంభం:17.05.2020 -
వేసవికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల మధ్య తొలిదఫా ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది. సికింద్రాబాద్–విజయవాడ మధ్య సూపర్‌ఫాస్ట్ సర్వీసులను నడుపు తోంది. ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28 జూన్ 4, 11, 18, 25 లలో ప్రత్యేక రైళ్లు (ట్రైన్ నం.07757) నడపనుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌లో ఉదయం 5.30కు బయలు దేరి ఉదయం 10.45కు విజయవాడ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25లలో విజయవాడలో (నం.07758) సాయంత్రం 5.30కి బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 10.50కి చేరతాయి. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరుల్లో ఆగుతాయి. నాందేడ్–తిరుపతి మధ్య (ట్రైన్ నం.07607/07608).. ఫిబ్రవరి 7, 14, 21, 28, మార్చి 7, 14, 21, 28, ఏప్రిల్ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27లలో నాందేడ్‌లో సాయంత్రం 6.45కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2కు తిరుపతి చేరుకుం టాయి. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 8, 15, 22, మార్చి 1, 8, 15, 22, 29, ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28లలో తిరుపతిలో సాయంత్రం 3.45కు బయలుదేరి మరుసటి ఉదయం 11.30కి నాందేడ్‌కు చేరుకుంటాయి.+ కాచిగూడ–టాటానగర్ మధ్య (ట్రైన్ నం.07438/07439).. మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1,8,15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.45కు టాటానగర్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో మార్చి 7, 14, 21, 28 ఏప్రిల్ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27 తేదీల్లో టాటానగర్‌లో రాత్రి 10.50 గంటలకు బయలుదేరతాయి. ఇవి మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, ఖుద్ర భువనేశ్వర్‌ల మీదుగా ప్రయాణిస్తాయి.