తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బి) పరీక్షల కోసం సిద్ధపడుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ప్రకటనలో తెలిపారు.
భద్రక్–గుంటూరు–భద్రక్ (08401/08402)
భద్రక్ –గుంటూరు (08401) ఎగ్జామ్ స్పెషల్ రైలు ఈనెల 10వ తేదీ రాత్రి 9గంటలకు భద్రక్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.35 గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి ఉదయం 6.55కు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంటూరు–భద్రక్ (08402) స్పెషల్ 11వ తేదీ రాత్రి 8గంటలకు గుంటూరులో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 2.30 విశాఖ చేరుకుని, ఇక్కడ నుంచి 2.50గంటలకు బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు భద్రక్ చేరుకుంటుంది.
ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఏసీ, 5–థర్డ్ ఏసీ, 9–స్లీపర్‌క్లాస్, 4–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజీ కోచ్‌లతో నడుస్తాయి. ఈ రైళ్లు ఇరు మార్గాలలో జైపూర్ కియోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ స్టేషన్‌లలో ఆగుతాయి.
చదవండి: ఏపీ టెట్–2022 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..?
భువనేశ్వర్–తాంబరం–భువనేశ్వర్ (08407/08408)
భువనేశ్వర్–తాంబరం (08407)ఎగ్జామ్ స్పెషల్ భువనేశ్వర్‌లో 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.15 విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి సాయంత్రం 5.35కు బయల్దేరి 12వ తేదీ ఉదయం 7.15కు తాంబరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తాంబరం–భువనేశ్వర్ (08408)స్పెషల్ 12వ తేదీ రాత్రి 10.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు 13వ తేదీ మధ్యాహ్నం 11.45కు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 12.05కు బయల్దేరి అదేరోజు రాత్రి 7గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు 1–సెకండ్ ఏసీ, 5–థర్డ్ ఏసీ, 8–స్లీపర్ క్లాస్, 2–జనరల్ సెకండ్ క్లాస్, 1–సెకండ్ క్లాస్ కం లగేజీ కం దివ్యాంగ కోచ్, 1–జనరేటర్ మోటార్‌కార్ కోచ్‌లతో నడుస్తాయి. ఈ స్పెషల్ ఇరుమార్గాలలో ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖ, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌లలో ఆగుతాయి.
షాలిమార్–సికింద్రాబాద్– షాలిమార్(08005/08006)
షాలిమార్ – సికింద్రాబాద్ (08005)ఎగ్జామ్ స్పెషల్ షాలిమార్‌లో 11వ తేదీ ఉదయం 6 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.25గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 8.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు 12వ తేదీ మధ్యాహ్నం 11కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్–షాలిమార్ స్పెషల్ సికింద్రాబాద్‌లో 14వ తేదీ మధ్యాహ్నం 2.30గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 5.20గంటలకు విశాఖపట్నం చేరుకుని, ఇక్కడ నుంచి 5.40గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 9.20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.
ఈ స్పెషల్ 1–సెకండ్ ఏసీ, 1–థర్డ్ ఏసీ, 11–స్లీపర్‌క్లాస్, 5–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజి/ దివ్యాంగ కోచ్‌లతో నడుస్తాయి. ఈ రైళ్లు ఇరుమార్గాలలో ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జాయ్‌పూర్ కియోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు స్టేషన్‌లలో ఆగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment