![Ten Candidates In The Fray For Uttarandhra Teachers Mlc Elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Districtcollector1.jpg.webp?itok=5ieC_y1w)
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. మొత్తం 20 నామినేషన్లు దాఖలు అయ్యాయని.. నాలుగు నామినేషన్లు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 16 నామినేషన్లకు ఆమోదం తెలిపామన్నారు. ఒక్కరు కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదన్నారు.
ఈ నెల 27న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎన్నిక నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఓటర్ స్లిప్స్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment