విశాఖ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో వైఎస్సార్‌ పేరు తొలగింపు! | YSR name removed from Visakhapatnam International Cricket Stadium: Andhra pradesh | Sakshi

విశాఖ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో వైఎస్సార్‌ పేరు తొలగింపు!

Mar 19 2025 5:38 AM | Updated on Mar 19 2025 5:43 AM

YSR name removed from Visakhapatnam International Cricket Stadium: Andhra pradesh

గతంలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం బోర్డు, ప్రస్తుతం ఏసీఏకు ముందు ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ పేరును తొలగించిన బోర్డు

ఆధునీకరణ పేరుతో మైదానంలో సర్కారు కుతంత్రం

బీచ్‌ తదితరచోట్ల వైఎస్సార్‌ వ్యూ పాయింట్లూ ఇప్పటికే ధ్వంసం

సర్కారు చర్యలతో క్రికెట్, వైఎస్సార్‌ అభిమానుల ఫైర్‌

మధురవాడ (విశాఖ) : నగరంలోని పీఎంపాలెం వద్దనున్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడి­యంలో మాజీ సీఎం వైఎస్సార్‌ పేరును పాలకవర్గం తొలగించింది. వైఎస్సార్‌ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా 2009 సెప్టెంబరు 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వ­ర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్‌ ఏసీఏ–­వీడీసీఏ స్టేడియంగా పేరు మార్చారు. అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.

తాజాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికా­రంలోకి వచ్చాక, ప్రధానంగా విశాఖలో వైఎస్సార్‌ గుర్తులు తుడి­చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా విశాఖ బీచ్‌ తదితరచోట్ల వైఎస్సార్‌ వ్యూ పాయింట్లు ధ్వంసం చేశారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో పలుచోట్ల ఉన్న వైఎస్సార్‌ పేరును మరమ్మతుల పేరిట తొలగించేస్తున్నారు. ఈ చర్యపట్ల క్రికెట్‌ అభిమానులతోపాటు వైఎస్సార్‌ అభిమానులు మం­డిపడుతున్నారు. ప్రభుత్వం మార్కు తన పాలనలో చూపించాలిగానీ ఇలాంటి విధ్వంసకర విషయాల్లో కాదని ఆక్షేపిస్తున్నా­రు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement