రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. | Several Special Trains Passenger Rush | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..

Published Sat, Nov 20 2021 6:41 PM | Last Updated on Sat, Nov 20 2021 6:44 PM

Several Special Trains Passenger Rush - Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీని తగ్గించి వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య పలు పూజా స్పెషల్‌ రైళ్లు నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే నిర్ణయించినట్లు, వాల్తేర డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠీ తెలిపారు.

చదవండి: దేత్తడి హారిక ఇల్లు ఎంత బాగుందో చూడండి! 

విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం(08579/18580) పూజా స్పెషల్‌:
విశాఖపట్నం–సికింద్రాబాద్‌(08579 పూజా స్పెషల్‌ రైలు ప్రతి బుధవారం రాత్రి 7గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ డిసెంబర్‌ 1 నుండి 29వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08580)సికింద్రాబాద్‌లో త్రపి గురువారం రాత్రి 7.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్‌ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగుడ, సత్తెనపల్లె స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ స్పెషల్‌ రైళ్లు 3–థర్డ్‌ ఏసీ, 8–స్లీపర్‌క్లాస్, 6–సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్‌ కం లగేజీ కోచ్‌లతో నడుస్తాయి.  

విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం(08585/08586) స్పెషల్‌ 
విశాఖపట్నం–సికింద్రాబాద్‌(08585) వీక్లీ పూజా స్పెషల్‌ ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంట లకు విశాఖపట్నంలో బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ డిసెంబరు 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08586) సికిందాబాద్‌లో ప్రతి బుధవారం రాత్రి 9.05గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబరు 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్‌ రైళ్లు ఇరుమార్గాలలో దువ్వాడ, సామర్ల కోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూ రు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ స్పెషల్‌ రైలు 1–సెకండ్‌ ఎసి, 3–థర్డ్‌ ఎసి, 10–స్లీపర్‌క్లాస్, 6–జనరల్‌ సెకండ్‌క్లాస్, 2–సెకండ్‌క్లాస్‌ కం లగేజీ/డిజేబుల్డ్‌ కోచ్‌లతో నడుస్తాయి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement