Sabarimala Special Trains in AP and Telangana: Date, Timing - Sakshi
Sakshi News home page

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Published Sat, Dec 11 2021 7:49 AM | Last Updated on Sat, Dec 11 2021 9:26 AM

Sabarimala Special Trains From Various Places AP And Telangana - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): శబరిమల వేళ్లే ప్రమాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్‌–కొల్లం ప్రత్యేక రైలు (07133) ఈ నెల 18న ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07134) ఈ నెల 19న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 
► కాచిగూడ–కొల్లం ప్రత్యేక రైలు (07135) ఈ నెల 22న ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07136) ఈ నెల 23న సాయంత్రం 7.35 గంటలకు కొల్లంలో బయలుదేరి, రెండోరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
► నాందేడ్‌–కొల్లం ప్రత్యేక రైలు (07137) ఈ నెల 23న ఉదయం 9.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
► కొల్లం–తిరుపతి ప్రత్యేక రైలు (07506) ఈ నెల 25న (శనివారం) మధ్యరాత్రి 12.45 గంటలకు కొల్లంలో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 5.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
► తిరుపతి–నాందేడ్‌ ప్రత్యేక రైలు (07138) ఈ నెల 26న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 3 గంటలకు నాందేడ్‌ చేరుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement