అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నిత్యం నడిచే రైళ్లు..
లింగంపల్లి–కాకినాడ పోర్ట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్: లింగంపల్లి స్టేషన్‌లో రాత్రి 8.30కి బయలుదేరి మరుసటి ఉదయం 7.20కి కాకినాడ చేరుకుంటుంది. నగరం వైపు వచ్చే రైలు కాకినాడలో రాత్రి 7.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05కు లింగంపల్లి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి.
లింగంపల్లి–తిరుపతి
లింగంపల్లిలో సాయంత్రం 5.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు తిరుపతిలో సాయంత్రం 6.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు లింగంపల్లి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, బీబీనగర్, నల్లగొండ, నడికుడి, గుంటూరు, ఒంగోలు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి.
అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు.. ప్రతిరోజూ నడిచేవి
తిరుపతి–అమరావతి (మహారాష్ట్ర)
తిరుపతిలో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50కి అమరావతి చేరుకుంటుంది. అమరావతిలో ఉదయం 6.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి తిరుపతి చేరుకుంటుంది.
రూట్:పాకాల, మదనపల్లి, కదిరి, ధర్మవరం, అనంతపురం, కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్‌ల మీదుగా..
అక్టోబర్ 23 నుంచి నవంబర్ 30 వరకు ప్రతిరోజూ..
లింగంపల్లి–నర్సాపూర్
లింగంపల్లిలో రాత్రి 9.05కు బయలుదేరి మరుసటి రోజు 7.45కు నర్సాపూర్ చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు నర్సాపూర్‌లో సాయంత్రం 6.55కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి లింగంపల్లికి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, నల్లగొండ, విజయవాడ, గుడివాడ, భీమవరం, పాలకొల్లు మీదుగా ప్రయాణిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment