ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి సీజన్‌లో ప్రత్యేక రైళ్లు  | SCR Announces Special Trains For Sankranti Festival 2024, Check Trains Details Inside - Sakshi
Sakshi News home page

Sankranti 2024 Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి సీజన్‌లో ప్రత్యేక రైళ్లు 

Published Fri, Dec 22 2023 10:06 AM | Last Updated on Fri, Dec 22 2023 11:10 AM

Special Trains For Sankranti 2024 - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

జనవరి 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం పూర్ణ–తిరుపతి (07609), జనవరి 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి–పూర్ణ (07610), జనవరి 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం హైదరాబాద్‌–నర్సాపూర్‌ (07631), జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07632),

ఈనెల 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి–సికింద్రాబాద్‌ (07481), జనవరి 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం సికింద్రాబాద్‌–తిరుపతి (07482), జనవరి 1 నుంచి 31 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ పోర్టు–లింగంపల్లి (07445), జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో లింగంపల్లి–కాకినాడ టౌన్‌ (07446) రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏజెన్సీలో హైవే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement