
విజయవాడ: అప్కాస్ విధానం రద్దుకు వ్యతిరేకంగా ఉద్యోగులు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకటో తేదీన జీతాలు తీసుకునే స్థితి నుంచి జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందంటూ ఆందోళన దిగారు. అప్కాస్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్కాస్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ మంచి చేశారని, దాన్ని రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగులు హోచ్చరించారు. అప్కాస్ ను యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా

మున్సిపల్ కార్మికులు సమస్యలు మాత్రం తీరడం లేదు. అప్కాస్ రద్దు చేయడం దుర్మార్గం. గత ప్రభుత్వం కాలంలో చేసుకున్న ఒప్పందాలను నేటి ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరం చేయడం లేదు. సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదనే ఆలోచనకు ప్రభుత్వం తీసుకుని వెళ్తుంది. అప్కాస్ రద్దు చేస్తే మునిసిపల్ వర్కర్స్ ను ఎక్కడ తీసుకుని పెడతారు.


ప్రవేట్ కాంట్రాక్టర్ల బందిఖానాలో వర్కర్స్ ను పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అప్కాస్ రద్దు కూటమి ప్రభుత్వంకి సరైనది కాదు. అప్కాస్ లో మొదటి తేదీనే జీతాలు పడుతున్నాయి.. కాంట్రాక్ట్ వ్యవస్ధ జీతాలు సమయంకి పడవు. అప్కాస్ రద్దు చేస్తే రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తాం. పిబ్రవరి చివరి వరకు జీతాల పెంపుకోసం చూస్తాం. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతాం.మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తే స్వచ్చ సర్వేక్షణ్ ఏవిధంగా సాధ్యం అవుతుంది.. మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగితే దానికి బాధ్యత కూటమి ప్రభుత్వందే’ అని సిఐటియు నాయకులు కాశీనాధ్ స్పష్టం చేశారు.

Comments
Please login to add a commentAdd a comment