outsorcing
-
సేవలు చేయించుకుని రోడ్డుపై పడేస్తారా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఏడాది పాటు సేవలు చేయించుకుని ఇప్పుడు 1,640 మంది ఔట్సోర్సింగ్ స్టాఫ్‌నర్సులను నడిరోడ్డుపై పడేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి జె. గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు దేవుళ్లతో సమానం అన్న కేసీఆర్‌కు నర్సులు దేవతల్లా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే స్టాఫ్‌నర్సులను పునఃనియమించాలని, లేదంటే వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. తమను విధుల్లోకి తీసుకోవాలని స్టాఫ్‌నర్సులు శుక్రవారం గాంధీభవన్‌లో చేపట్టిన దీక్షను గీతారెడ్డి విరమింపజేశారు. ఈ సందర్భంగా గీతా రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి, మానవత్వం ఉంటే ఈ ఆడబిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. స్టాఫ్‌నర్సులను ప్రభుత్వం 10 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని, అధికార పార్టీ నేతలను అడ్డుకుంటామని యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి హెచ్చరించారు. కాగా, దీక్ష విరమణ సందర్భంగా గీతారెడ్డితో మాట్లాడుతూ స్టాఫ్‌నర్సులు కంటతడి పెట్టుకున్నారు. -
లైట్ జాబా.. అయితే ఓకే
సాక్షి,మంచిర్యాల : ‘భూగర్భ గనుల్లో పనిచేసేందుకు యువత ఆసక్తి చూపడంలేదు. ఉన్నత చదువులు చదువుకున్న వారు అన్ని పనులను ఇష్టపడటంలేదు.. అందరూ తేలికపాటి పనుల కోసం ఎదురు చూస్తున్నారు.’అని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఇటీవల నిర్వహించిన జేసీసీ సమావేశంలో కార్మిక సంఘాలతో పేర్కొన్నారు. మరికొద్ది రోజులు ఇదేవిధంగా ముందుకు సాగితే సంస్థ అభివృద్ధికి, మానవ వనరులకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు.సంస్థలో ఉత్పత్తి వైపు 80 శాతం మంది పనిచేయాల్సి ఉండగా మిగతా 20 శాతం మంది కార్యాలయాలు, డిపార్ట్మెంట్ ల లో పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం నూతనంగా ఉద్యోగాల్లోకి వచ్చే యువత కార్యాలయాల వైపే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. విధులకు గైర్హాజర్.. అనారోగ్య కారణాల రీత్యా కార్మికులను మెడికల్ ఇన్వాలిడేషన్(అన్‌ఫిట్) చేసి యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తోంది. ఇలా నియమితులైన యువ కార్మికులు భూగర్భగనుల్లోకి వెళ్లి పనిచేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇటీవల చేరిన సుమారు 4వేల మందిలో చాలా మంది ఇలాంటి ఉద్యోగాలవైపే మక్కువ చూపుతున్నారు. దీంతో కీలకమైన పని స్థలాల్లో పనిచేసే కార్మికులు కొరవడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చాలా మంది యువ ఉద్యోగులు విధులకు గైర్హాజరవుతూ ఉద్యోగాలకు ముప్పుతెచ్చునే పరిస్థితిల్లో ఉన్నట్లు సమాచారం. ఒక్క వకీల్‌పల్లిగనిలో 35మంది యువ కార్మికులు గైర్హాజర్ కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరిన్ని విభాగాలు ఔట్ సోర్సింగ్‌కు..? సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనుల్లో పని చేసే మరిన్ని విభాగాలను ఔట్ సోర్సింగ్చేసే దిశ గా యాజమాన్యం ముందుకు సాగుతోంది. భూగ ర్భ గనుల్లో మేషన్ పనిచేసేందుకు కార్మికులు ఆసక్తి కనబర్చకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా భూగర్భ గనిలోకి దించేందుకు యాజ మాన్యం ప్రయత్నించింది. దీన్ని గుర్తింపు యూనియన్ నాయకులు తిప్పి కొట్టడంతో ప్రస్తుతానికి నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో ఈపని ప్రైవేట్‌పరం తప్పకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. భూగర్భగనుల్లో కష్టంగా ఉన్న టింబర్‌మెన్, కోల్‌కట్టర్, సపోర్ట్‌మెన్ పనులు కూడా ప్రైవేట్ పరం చేసేందుకు యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. నూతనంగా ఉద్యోగాల్లోకి చేరే కార్మికులు ఈ పని చేసేందుకు ముందుకు రాకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు. పెరిగిపోతున్న రాజకీయ జోక్యం గతంలో సింగరేణిలో నూతనంగా ఉద్యోగాల్లోకి చేరే యువ కార్మికులకు తప్పనిసరిగా భూగర్భగనిలో పనిచేయాలనే నిబంధన ఉండేది. ఇన్ని టబ్బులు, మస్టర్లు పూర్తి చేయాలనే రూల్స్ విధించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే మొదలుకొని రాష్ట్ర మంత్రి వరకు పైరవీ లెటర్లతో అందరూ తేలిక ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. ఈక్రమంలో సంస్థ పరిస్థితి రాబోయే రోజుల్లో ఇబ్బంది కరంగా తయారుకావచ్చనే ప్రచారం సాగుతోంది. టెక్నీషియన్ల వైపు యాజమాన్యం చూపు.. భూగర్భ గనుల్లో పూర్తి స్థాయి యాంత్రీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా అందరినీ తీసుకునే దానికన్నా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులను బయటి వారిని తీసుకుంటే సంస్థ పురోభివృద్ధికి దోహదం చేస్తారనే ఆలోచనలో సీఎండీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మెడికల్ ఇన్వాలిడేషన్ పట్ల ఆయ న ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని అంటున్నా రు. ఉత్పత్తి వైపు పనిచేసే ఉద్యోగులు కావాలనే లక్ష్యంతో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. -
ఇతర శాఖల్లో సర్దుబాటు చేయండి
తొలగించిన హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రిలేదీక్షలు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ సంఘీభావం ముకరంపుర : రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ సంఘీభావం తెలిపారు. తొలగించిన ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర గహనిర్మాణ సంస్థలో 2006 నుంచి పదేళ్లుగా ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ విభాగాల్లో అరకొర వేతనాలతో విధులు నిర్వహించామని తెలిపారు. బడ్జెట్ కేటాయించలేదనే సాకుతో విధుల్లో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ఆశిస్తే..రోడ్డుపైకి వచ్చామన్నారు. ఇప్పటికే 50 మందికిపైగా ఇతర శాఖల్లో భర్తీ చేశారని, మిగతా వారిని సైతం సర్దుబాటు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి, కోశాధికారులు వి.నాగచారి, డి.ప్రభాకర్, సీహెచ్.జంపయ్య, ఎండీ ఇలియాస్, ఉపాధ్యక్షులు ఇ.రాజయ్య, బి.కుమారస్వామి, లావణ్య, శ్రీనివాసస్వామి, జి.సమ్మయ్య, ఎ.శ్యాంసుందర్, ఎం.కవిత, ఎస్.శ్రీదేవి, సీహెచ్.రమాదేవి, ఎస్.బాబురావు పాల్గొన్నారు.