- తొలగించిన హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రిలేదీక్షలు
- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ సంఘీభావం
ఇతర శాఖల్లో సర్దుబాటు చేయండి
Published Wed, Aug 24 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
ముకరంపుర : రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఔట్‌సోర్సింగ్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ సంఘీభావం తెలిపారు. తొలగించిన ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర గహనిర్మాణ సంస్థలో 2006 నుంచి పదేళ్లుగా ఔట్‌సోర్సింగ్ విధానంలో వివిధ విభాగాల్లో అరకొర వేతనాలతో విధులు నిర్వహించామని తెలిపారు. బడ్జెట్ కేటాయించలేదనే సాకుతో విధుల్లో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ఆశిస్తే..రోడ్డుపైకి వచ్చామన్నారు. ఇప్పటికే 50 మందికిపైగా ఇతర శాఖల్లో భర్తీ చేశారని, మిగతా వారిని సైతం సర్దుబాటు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి, కోశాధికారులు వి.నాగచారి, డి.ప్రభాకర్, సీహెచ్.జంపయ్య, ఎండీ ఇలియాస్, ఉపాధ్యక్షులు ఇ.రాజయ్య, బి.కుమారస్వామి, లావణ్య, శ్రీనివాసస్వామి, జి.సమ్మయ్య, ఎ.శ్యాంసుందర్, ఎం.కవిత, ఎస్.శ్రీదేవి, సీహెచ్.రమాదేవి, ఎస్.బాబురావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement