Dr. Nagesh
-
గుంతలు పూడ్చాలని వైఎస్సార్సీపీ రాస్తారోకో
ధర్మారం: మండలంలోని కటికెనపల్లి నుంచి ధర్మారం వరకు రహదారిపై పడిన గుంతలను పూడ్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కటికెనపల్లి బస్టాండు వద్ద రాస్తారోకో చేశారు. ఆందోళన కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై హరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా డాక్టర్ నగేష్ మాట్లాడుతూ కరీంనగర్ నుంచి రాయపట్నంవరకు ఉన్న స్టేట్‌హైవే గుంతలమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు కల్గుతున్నాయన్నారు. కటికెనపల్లినుంచి ధర్మారం వరకు రోడ్డు పూర్తిగా శిథిలమై గుంతలు ఏర్పడటంతో రోడ్డు ప్రమాదకరంగా ఉందని తెలిపారు. పలు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడంలేదని పేర్కొన్నారు. ఈవిషయమై చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం యంత్రాంగం తక్షణమే స్పందించి మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్‌రెడ్డి, సంపంగి సతీష్, రాము, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, నాయకులు మహేందర్, సంతోష్, మనోజ్, సంజీవ్, రాజు, కుమార్, శ్రీనివాస్, రాజేశ్, ఆవుల వేణు, కనుకయ్య, నాగరాజు, తిరుపతి పాల్గొన్నారు. -
ఇతర శాఖల్లో సర్దుబాటు చేయండి
తొలగించిన హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రిలేదీక్షలు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ సంఘీభావం ముకరంపుర : రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ సంఘీభావం తెలిపారు. తొలగించిన ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర గహనిర్మాణ సంస్థలో 2006 నుంచి పదేళ్లుగా ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ విభాగాల్లో అరకొర వేతనాలతో విధులు నిర్వహించామని తెలిపారు. బడ్జెట్ కేటాయించలేదనే సాకుతో విధుల్లో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ఆశిస్తే..రోడ్డుపైకి వచ్చామన్నారు. ఇప్పటికే 50 మందికిపైగా ఇతర శాఖల్లో భర్తీ చేశారని, మిగతా వారిని సైతం సర్దుబాటు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి, కోశాధికారులు వి.నాగచారి, డి.ప్రభాకర్, సీహెచ్.జంపయ్య, ఎండీ ఇలియాస్, ఉపాధ్యక్షులు ఇ.రాజయ్య, బి.కుమారస్వామి, లావణ్య, శ్రీనివాసస్వామి, జి.సమ్మయ్య, ఎ.శ్యాంసుందర్, ఎం.కవిత, ఎస్.శ్రీదేవి, సీహెచ్.రమాదేవి, ఎస్.బాబురావు పాల్గొన్నారు.