రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే పీఆర్‌వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–కాకినాడ టౌన్ (07653) రైలు ఈనెల 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07654) ఈనెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాచిగూడ చేరుతుంది. హైదరాబాద్–కాకినాడ టౌన్ (07023) రైలు ఈనెల 10న సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07024) 11న రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment