వేసవికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల మధ్య తొలిదఫా ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది. సికింద్రాబాద్–విజయవాడ మధ్య సూపర్‌ఫాస్ట్ సర్వీసులను నడుపు తోంది. ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28 జూన్ 4, 11, 18, 25 లలో ప్రత్యేక రైళ్లు (ట్రైన్ నం.07757) నడపనుంది.
ఈ రైళ్లు సికింద్రాబాద్‌లో ఉదయం 5.30కు బయలు దేరి ఉదయం 10.45కు విజయవాడ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25లలో విజయవాడలో (నం.07758) సాయంత్రం 5.30కి బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 10.50కి చేరతాయి. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరుల్లో ఆగుతాయి.
నాందేడ్–తిరుపతి మధ్య (ట్రైన్ నం.07607/07608)..
ఫిబ్రవరి 7, 14, 21, 28, మార్చి 7, 14, 21, 28, ఏప్రిల్ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27లలో నాందేడ్‌లో సాయంత్రం 6.45కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2కు తిరుపతి చేరుకుం టాయి. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 8, 15, 22, మార్చి 1, 8, 15, 22, 29, ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28లలో తిరుపతిలో సాయంత్రం 3.45కు బయలుదేరి మరుసటి ఉదయం 11.30కి నాందేడ్‌కు చేరుకుంటాయి.+
కాచిగూడ–టాటానగర్ మధ్య (ట్రైన్ నం.07438/07439)..
మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1,8,15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.45కు టాటానగర్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో మార్చి 7, 14, 21, 28 ఏప్రిల్ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27 తేదీల్లో టాటానగర్‌లో రాత్రి 10.50 గంటలకు బయలుదేరతాయి. ఇవి మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, ఖుద్ర భువనేశ్వర్‌ల మీదుగా ప్రయాణిస్తాయి.