సాక్షి, కోల్‌కతా : శబరిమల వివాదం నేపథ్యంలో కోల్‌కతాలోని ఓ కాళికామాత ఆలయంలోనూ మూడు దశాబ్ధాలకు పైగా మహిళలకు ప్రవేశం కల్పించని ఉదంతం వెలుగుచూసింది. ఆలయ ప్రాంగణంలోకి మహిళలను అనుమతించే విషయంలో శబరిమల ఆలయ కమిటీ తరహాలోనే పంచముంద కాళీ పూజా కమిటీ కఠినంగా వ్యవహరిస్తోంది.
ప్రతి ఏటా తాంత్రిక పూజలు నిర్వహించే పంచముంద కాళీ పూజ సమయంలో మహిళలను ఆలయ పరిసరాల్లోకి అనుమతించరని, వారి నీడను కూడా తాకనీయమని ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యుడు గంగారాం షా వెల్లడించారు. గత 34 ఏళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతున్నదన్నారు.
నవంబర్ 6న కాళీ పూజను నిర్వహిస్తారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్‌లో ఈ ఆలయంలో మహిళలకు ప్రవేశం ఉంటుందా లేక నిరసనలకు కేంద్ర బిందువవుతుందా అనేది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment