నెల్లూరు: నెల్లూరులోని ఎస్‌బీఐ కాలనీలో న్యాయం కోరుతూ అత్తింటి ఎదుట వివాహిత ఆందోళనకు దిగింది. నెల్లూరుకు చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు వెంకటేశ్వర్లుకు గూడూరుకి చెందిన భవానీతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వెంకటేశ్వర్లు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నారు. కాగా, దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి.
ఆదివారం ఉదయం తమ ఇంటికి వచ్చిన భవానీని వెంకటసుబ్బయ్య దంపతులు లోపలికి రానివ్వలేదు. ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో భవానీ అక్కడే ఆందోళనకు దిగింది. మహిళా సంఘాల నేతలు ఆమెకు మద్దతు పలికారు.