ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఎన్‌ఏడీ ఎస్‌బీఐ ఆర్‌ఏసీపీసీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న చిట్టాజీ గంగా భవాని(28) బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు, ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని చీడిగకు చెందిన గంగాభవాని మర్రిపాలెం వుడా లేఅవుట్‌లోని సాంబశివ అపార్ట్‌మెంట్‌లో ఏడాదిగా నివాసం ఉంటోంది. బుధవారం విధులు నిర్వర్తించేందుకు బ్యాంక్‌కు వెళ్లింది. మధ్యాహ్నం భోజన విరామం çసమయంలో ఇంటికి వచ్చి తిరిగి బ్యాంక్‌కు వెళ్లలేదు.
సాయంత్రం 4.30 సమయంలో బ్యాంక్‌లోని ఆమె స్నేహితురాలు రమాదేవికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, గంగాభవాని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలి పాడు. ఇంటికి వెళ్లి చూడాలని కోరాడు. దీంతో బ్యాంక్ ఉన్నతాధికారులు అనుమతి పొంది ఆమె ఇంటికి వెళ్లి చూసింది. తలుపులు మూసి ఉండటంతో ఇంటికి వచ్చిందా.. లేదా బయటకు వెళ్లిందా అన్న విషయాలు నిర్ధారించుకోవడానికి సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించినట్టు ఆమె తెలిపింది. గంగా భవాని ఇంట్లోకి వెళ్లిందని గుర్తించిన ఆమె బ్యాంక్ అధికా రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గది తలుపులు తెరచి చూడగా ఫ్యాన్‌కు చున్ని కట్టి గంగాభవాని ఉరి వేసుకుని ఉంది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీసులకు తెలియజేసింది. గంగా భవానికి వివాహమై మూడు నెలలు అయింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగా నివసిస్తోంది. వెస్ట్‌జోన్ ఏసీపీ భీమారావు, ఎయిర్‌పోర్ట్ జోన్ సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గురువారం తహసీల్దార్, కుటుంబ సభ్యుల సమక్షంలో శవ పంచనామా నిర్వహిస్తామని ఏసీపీ తెలిపారు.
బ్యాంక్ ఉద్యోగిని బలవన్మరణం
Published Thu, Jul 6 2017 8:53 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
Advertisement
Advertisement