ఉప్పల్ పరిధిలోని మేడిపల్లి పీ అండ్ టీ కాలనీలో నివాసముంటున్న భవాని(22) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెంది .. రాత్రి అందరూ నిద్రపోతున్న సమంయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
వరంగల్ జిల్లాకు చెందిన భవాని అదే జిల్లాకు చెందిన దోమల పృద్వీరాజుతో 2014లో వివాహం జరిగింది. భవాని నగరంలోని ఓ వైద్య కళాశాలలో విద్యార్థిని. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.