రంగంపేట మండలం పెద్దరాయవరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు.
రంగంపేట మండలం పెద్దరాయవరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. సామర్లకోట నుంచి రాజానగరం వైపు బైక్‌పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సామర్లకోట పట్టణానికి చెందిన కటారి శ్రీనివాసరావు(40), భవాని(28) అనే దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.