అయ్యో! ఎంత ఘోరం | road accident dead Bodies reached peddapuram | Sakshi
Sakshi News home page

అయ్యో! ఎంత ఘోరం

Published Thu, Jan 25 2018 1:35 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

road accident dead Bodies reached peddapuram - Sakshi

మిగిలిని ఒక్క మనుమరాలితో రోదిస్తున్న సురేష్‌ తల్లిదండ్రులు (అంతరచిత్రం) సురేష్, నిశ్చల మృతదేహాలు

పెద్దాపురం: అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది. పాపం మొన్ననే భార్యనే పొగట్టుకుని రెండు నెలల కాలేదు. అంతలోనే చిన్న పాపతో పాటు తను కూడా తనువు చాలించాడా! జోస్యుల సురేష్‌ వద్ద పలువురు కన్నీటి పర్యంతం కావడం పలువురి హృదయాలను కలచివేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నలజర్ల మండలం అనంతపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెద్దాపురం కాకర్ల వారి వీధికి చెందిన జోస్యుల సురేష్, అతడి చిన్న కుమార్తె ఏడాదిన్నర వయస్సున్న నిశ్చల మృతదేహాలు బుధవారం వారి స్వగృహానికి చేరాయి.

ఉన్న ఒక్కగానొక్క కుమారుడు, కుమార్తె, మనుమరాలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమంటూ సురేష్‌ తండ్రి జోగేశ్వర శర్మ, తల్లి లక్ష్మి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. స్వల్పగాయాలతో బయటపడిన పెద మనుమరాలు సువర్చల(5)ను హృదయానికి హత్తుకుని తల్లడిల్లిన తీరుతో కాకర్లవారి వీ«ధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అందరితో మమేకమై..
పురోహిత్యం చేస్తూ అందరితో మమేకమయ్యే సురేష్‌ మృతదేహాన్ని చూసి పలువురు చలించిపోయారు. పట్టణంలోని అన్ని దేవాలయాలు, వైశ్య కుటుంబీకులకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన  సురేష్‌ మరణ వార్త విన్న పట్టణంలో పలువురు ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement