రోడ్డు ప్రమాదంలో అక్కా,తమ్ముడు మృతి | 2 died in road accident at east godavari district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అక్కా,తమ్ముడు మృతి

Published Thu, Jan 18 2018 10:49 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

 2 died in road accident at east godavari district

సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని రాజానగరం మండలం దివాన్‌ చెరువు వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న అక్కా, తమ్ముడు సంఘటనా స్థలిలోనే మరణించారు.

ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement