లారీ బోల్తా..ముగ్గురి మృతి | three killed in road accident in east godavari district | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా..ముగ్గురి మృతి

Published Mon, May 30 2016 9:17 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

three killed in road accident in east godavari district

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో ఆదివారం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement