సవతితల్లి చేతిలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఘటనను ఇంకా మరవక ముందే హైదరాబాద్ నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగు చూసింది. అన్న, వదినల దాష్టీకానికి చిత్రహింసలకు గురైన యువతికి చివరకు బాలల హక్కుల సంఘం చొరవ తీసుకోవడంతో విముక్తి లభించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉప్పులూరి ఏసు, తిరుపతమ్మ దంపతుల ఏకైక సంతానం భవాని (18). తల్లిదండ్రులిద్దరూ ఎనిమిదేళ్ల కిందట చనిపోయారు. దీంతో ఎవరూ పోషించలేని స్థితిలో యువతి మహబూబ్‌నగర్‌లోనే ఓ హాస్టల్‌లో చేరింది. కాగా, సైనిక్‌పురిలోని టెలికం కాలనీలో నివాసముంటున్న భవాని పెద్దనాన్న కుమారుడు (వరసకు అన్న) శ్రీనివాస్, వదిన లక్షీ్ష్మలు తాము పోషించుకుంటామని చెప్పి యువతిని హాస్టల్ నుంచి తీసుకొచ్చారు.
Published Sat, Jul 25 2015 7:56 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement