prathyusa
-
సీఎం కేసీఆర్ దత్త పుత్రిక నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ప్రత్యూష త్వరలో ఓ ఇంటి కోడలుగా వెళ్లబోతున్నారు. రాంనగర్ ప్రాంతానికి చెందిన మమత, మర్ రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను విద్యానగర్‌లోని హోటల్లో నిరాడంబరంగా నిర్వహించారు. వరుణు చరణ్‌రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా గతంలో సొంత తండ్రి, పినతల్లి చిత్రహింసలతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూష ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె దీనస్థితిని చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో తానే స్వయంగా ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావుకు అప్పగించారు. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రత్యూష బాగోగులు మహిళా శిశు సంక్షేమ శాఖ చూస్తోంది.ఈ ఐదేళ్లలో ఆమె ఆరోగ్యపరంగా మెరుగైంది. ఉన్నత చదువులు చదివిన ప్రత్యూష.. నర్సింగ్ కోర్సు పూర్తిచేసి, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్‌రెడ్డి.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పింది.దీంతో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలుపగా.. వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. చదవండి: రూ.5 వేల కోట్ల నష్టం.. దీంతో సీఎం కేసీఆర్ ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే చరణ్‌రెడ్డి వివరాలను తెలుసుకున్న సీఎం సంతోషం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లాలని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ డి.దివ్యకు సూచించారు. కమిషనర్ డీ దివ్య ఆధ్వర్యంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. తన పెళ్లికి కచ్చితంగా వస్తానని కేసీఆర్ చెప్పారని, ఆయన అండతో కోలుకున్నానని ప్రత్యూష తెలిపారు. పెళ్లి చేసుకొని మంచి కుటుంబంలోకి వెళుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. -
భవాని.. మరో ‘ప్రత్యూష’
-
భవాని.. మరో ‘ప్రత్యూష’
వేధింపులకు గురిచేస్తున్న అన్నావదినలు బాలల హక్కుల సంఘం చొరవతో విముక్తి హైదరాబాద్: సవతితల్లి చేతిలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఘటనను ఇంకా మరవక ముందే హైదరాబాద్ నేరేడ్మెట్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగు చూసింది. అన్న, వదినల దాష్టీకానికి చిత్రహింసలకు గురైన యువతికి చివరకు బాలల హక్కుల సంఘం చొరవ తీసుకోవడంతో విముక్తి లభించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉప్పులూరి ఏసు, తిరుపతమ్మ దంపతుల ఏకైక సంతానం భవాని (18). తల్లిదండ్రులిద్దరూ ఎనిమిదేళ్ల కిందట చనిపోయారు. దీంతో ఎవరూ పోషించలేని స్థితిలో యువతి మహబూబ్‌నగర్‌లోనే ఓ హాస్టల్లో చేరింది. కాగా, సైనిక్‌పురిలోని టెలికం కాలనీలో నివాసముంటున్న భవాని పెద్దనాన్న కుమారుడు (వరసకు అన్న) శ్రీనివాస్, వదిన లక్షీ్ష్మలు తాము పోషించుకుంటామని చెప్పి యువతిని హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. ఇంటికి రాగానే భవానికి ఇంటిపని అప్పజెప్పారు. సమయానికి కడుపునిండా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసేవారు. కాల్చిన గరిటెతో ఒంటిపై వాతలు కూడా పెట్టేవారు. కొన్నాళ్లుగా భవాని అనుభవిస్తున్న బాధలు చూడలేక స్థానికులు కొందరు బాలల హక్కుల సంఘానికి సమాచారం అందజేశారు. వెంటనే స్పందించిన బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అచ్యుతరావు, అనురాధారావు పోలీసుల సహాయంతో భవానికి ఆ ఇంటి నుంచి విముక్తి కల్పించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న అన్న, వదినలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స కోసం యువతను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆమెను విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్టల్‌కు తీసుకెళ్లనున్నట్లు అచ్యుతరావు తెలిపారు.