అల్లరి చేస్తున్నాడన్న కోపంతో వాళ్ల పెద్దమ్మ ఓ చిన్నారికి వాతలు పెట్టింది. యనమనలకుదురు ప్రియదర్శినినగర్‌కు చెందిన కోవెల ప్రభు, శైలజ దంపతులకు రాజ్‌కుమార్(6), శివకుమార్(4) ఉన్నారు. నాలుగురోజుల క్రితం ఊరెళుతూ రాజ్‌కుమార్‌ను ఇంటి పక్కనే ఉండే మేడే భవానికి అప్పజెప్పి వెళ్లింది. మంగళవారం రాజ్‌కుమార్ అల్లరి ఎక్కువగా చేస్తుండటంతో విసుగు చెందిన భవాని గరిట కాల్చి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది.