అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
Published Tue, Mar 21 2017 5:22 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
కృష్ణా: అల్లరి చేస్తున్నాడన్న కోపంతో వాళ్ల పెద్దమ్మ ఓ చిన్నారికి వాతలు పెట్టింది. యనమనలకుదురు ప్రియదర్శినినగర్‌కు చెందిన కోవెల ప్రభు, శైలజ దంపతులకు రాజ్‌కుమార్(6), శివకుమార్(4) ఉన్నారు. నాలుగురోజుల క్రితం ఊరెళుతూ రాజ్‌కుమార్‌ను ఇంటి పక్కనే ఉండే మేడే భవానికి అప్పజెప్పి వెళ్లింది. మంగళవారం రాజ్‌కుమార్ అల్లరి ఎక్కువగా చేస్తుండటంతో విసుగు చెందిన భవాని గరిట కాల్చి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది.
ఊరు నుంచి వచ్చిన తర్వాత బిడ్డకు గాయాలైనా పట్టించుకోకుండా వదిలేసింది శైలజ. కాగా, కాలిన గాయాలతో స్ధానిక అంగన్‌వాడీ కేంద్రానికి మంగళవారం ఉదయం బాలుడు వచ్చాడు. బాలుడి శరీరంపై ఉన్న గాయాలను చూసిన అంగన్‌వాటీ కార్యకర్త ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో బాలుడిని హింసించిన ఘటనను నవజీవన్ బాల భవన్ కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకున్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు.
బాలుడి తల్లి శైలజ, పెద్దమ్మ భవానీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ప్రేమలేని శైలజ వారి ఆలనాపాలనలను చూడటం మానేసింది. గతంలో ఓ సారి పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది శైలజ. దీంతో విజయవాడ చైల్డ్‌లైన్ నిర్వాహకులు పిల్లల్ని తీసుకువెళ్లి సంరక్షించారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. కేసును విచారించిన పోలీసులు శైలజ, భవానీలను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement