Deaflympics
-
Deaflympics 2022: షేక్ జాఫ్రీన్‌కు కాంస్యం
కాక్సియాల్ డు సల్ (బ్రెజిల్): బధిరుల ఒలింపిక్ క్రీడల్లో (టెన్నిస్) ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ కాంస్య పతకం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్–పృథ్వీ శేఖర్ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్ దూబే జంటను ఓడించింది. ఈ జోడీలో భవాని తెలంగాణకు చెందిన ప్లేయర్. అంతకు ముందు సెమీ ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన బ్లాస్కికోవా–స్మెడెక్ చేతిలో 7–5, 5–7, 2–6తో జాఫ్రీన్–పృథ్వీ ఓడగా...వెన్ లిన్–వీ వాంగ్ (చైనీస్ తైపీ) 6–0, 6–1తో భవాని–ధనంజయ్‌పై గెలుపొందారు. -
చరిత్ర సృష్టించిన దీక్ష డాగర్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
బ్రెజిల్లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్ దీక్ష డాగర్ స్వర్ణ పతకంతో మెరిసింది. గురువారం అమెరికాకు చెందిన యాష్లిన్ గ్రేస్ జాన్సన్‌తో జరిగిన ఫైనల్లో 5-4తో ఓడించి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా డెఫిలింపిక్స్‌లో దీక్ష డాగర్‌కు ఇది రెండో పతకం. ఇంతకముందు 2017 ఆమె రజతం గెలిచింది. ఓవరాల్‌గా డెఫిలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత గోల్ఫర్గా దీక్ష డాగర్ చరిత్ర సృష్టించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చివరి నిమిషంలో అర్హత సాధించిన దీక్ష డాగర్.. ఒలిపింక్స్‌తో పాటు డెఫిలింపిక్స్ ఆడిన తొలి గోల్ఫ్ ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించింది. అంతకముందు బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష... అండ్రియా హోవ్‌స్టెయిన్ (నార్వే)పై విజయం సాధించింది. ఇక బధిరుల ఒలింపిక్స్‌లో భారత్ తాజా దానితో కలిపి ఇప్పటివరకు 10 పతకాలు గెలుచుకుంది. ఇందులో ఏడు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: Asia Cup: ఆర్చరీలో భారత్ అదుర్స్ Golfer🏌️♀️Diksha Dagar won GOLD🥇at Brazil #Deaflympics2021! 😍 Congratulations on this amazing victory! 👏#JeetKaJazba https://t.co/jZigPgNSma — Dept of Sports MYAS (@IndiaSports) May 12, 2022 -
బధిరుల ఒలింపిక్స్ గోల్ఫ్ ఫైనల్లో దీక్ష
బ్రెజిల్లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్ దీక్ష డాగర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గత క్రీడల్లో (2017)లో రజతం గెలిచిన ఆమె ఈ సారి స్వర్ణ పతకంపై గురి పెట్టింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష... అండ్రియా హోవ్‌స్టెయిన్ (నార్వే)పై విజయం సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో భారత గోల్ఫర్ అమెరికాకు చెందిన యాష్లిన్ గ్రేస్ జాన్సన్‌తో తలపడుతుంది. -
Deaflympics 2022: షేక్ జాఫ్రీన్, భవాని జోడీలకు పతకాలు ఖాయం
బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో షేక్ జాఫ్రీన్ (ఆంధ్రప్రదేశ్), భవాని కేడియా (తెలంగాణ) తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో షేక్ జాఫ్రీన్–పృథ్వీ శేఖర్ (భారత్) జంట 6–1, 6–1తో టుటెమ్– ఎమిర్ (టర్కీ) జోడీపై నెగ్గగా... భవాని–ధనంజయ్ దూబే (భారత్) జోడీకి జర్మనీ జంట నుంచి ‘వాకోవర్’ లభించింది. -
Deaflympics 2022: అదరగొట్టిన ధనుష్ శ్రీకాంత్
న్యూఢిల్లీ: మరోసారి తన గురితో తెలంగాణ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకాన్ని అందించాడు. బ్రెజిల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా దేశ్‌ముఖ్ జంట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని వేసింది. ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా ద్వయం 16–10 పాయింట్ల తేడాతో సెబాస్టియన్ హెర్మానీ–సబ్రీనా (జర్మనీ) జోడీపై విజయం సాధించి విజేతగా నిలిచింది. వరుసగా నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం తోపాటు 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ మేటి షూటర్ గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్న ధనుష్ శ్రీకాంత్‌కు ఈ బధిరుల ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం కావడం విశేషం. ఇంతకుముందు ధనుష్ శ్రీకాంత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. క్వాలిఫయింగ్‌లో శ్రీకాంత్–ప్రియేషా జంట 414 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. కాంస్య పతక పోరులో శౌర్య సైనీ–నటాషా జోషి (భారత్) జంట 8–16తో వయోలెటా–అలెగ్జాండర్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో ఆరో ర్యాంక్‌లో ఉంది. -
భళా అభినవ్ దేశ్వాల్.. భారత్‌కు మరో స్వర్ణం
న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. బ్రెజిల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో 15 ఏళ్ల అభినవ్ దేశ్వాల్ భారత్‌కు పసిడి పతకం అందించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అభినవ్ ఫైనల్లో 234.2 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. బధిరుల ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు లభించిన నాలుగో పతకమిది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం, శౌర్య సైనీ కాంస్యం నెగ్గగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వేదిక శర్మ కాంస్యం సొంతం చేసుకుంది. -
డెఫిలింపిక్స్‌లో మెరిసిన హైదరాబాద్ షూటర్..భారత్‌కు గోల్డ్‌మెడల్
విశ్వ వేదికపై తెలుగు తేజం ధనుష్ శ్రీకాంత్ మరోసారి తన గురితో అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో ఈ తెలంగాణ యువ షూటర్ భారత్‌కు బంగారు బోణీ అందించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన శౌర్య సైనీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లోనే కాంస్య పతకం దక్కించుకున్నాడు. గత ఏడాది ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో స్వర్ణం... 2019లో ఆసియా చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు గెలిచిన ధనుష్ శ్రీకాంత్ అదే జోరును డెఫిలింపిక్స్లోనూ కొనసాగించాడు. కాక్సియస్ డు సుల్ (బ్రెజిల్): భారీ బృందంతో బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన భారత్ ఒకే రోజు మూడు పతకాలతో మెరిసింధి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన షూటింగ్, బ్యాడ్మింటన్ ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు సంపాదించారు. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం... శౌర్య సైనీ కాంస్యం సాధించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో టీమిండియా బంగారు పతకం దక్కించుకుంది. జెర్లీన్, అభినవ్ శర్మ, ఆదిత్య యాదవ్, శ్రేయా సింగ్లా, రోహిత్ భాకెర్, హృతిక్ ఆనంద్‌లతో కూ డిన భారత్ ఫైనల్లో 3–1తో జపాన్ను ఓడించింది. ప్రస్తుతం భారత్ మూడు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. కొత్త ప్రపంచ రికార్డుతో... ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్ 247.5 పాయింట్లు స్కోరు చేశాడు. బధిరుల విభాగం ఫైనల్లో ఇది కొత్త ప్రపంచ రికార్డు కావడం విశేషం. గతంలో ఈ రికార్డు కొలిన్ ముల్లర్ (జర్మనీ; 243.2 పాయింట్లు) పేరిట ఉండేది. ఎలిమినేషన్ పద్ధతిలో 24 షాట్లపాటు జరిగిన ఫైనల్లో కొరియా షూటర్ కిమ్ వూ రిమ్ 246.6 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... శౌర్య సైనీ 224.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో ధనుష్ 623.3 పాయింట్లతో రెండో స్థానంలో, శౌర్య 622.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు లభించాయి. గగన్ నారంగ్ శిక్షణలో... భారత స్టార్ షూటర్, హైదరాబాద్‌కే చెందిన గగన్ నారంగ్‌కు చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో ధనుష్ శ్రీకాంత్ ఐదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. బధిరుడైన శ్రీకాంత్‌కు గగన్ ప్రత్యేక పద్ధతిలో శిక్షణ ఇచ్చాడు. రైఫిల్‌ను ఎలా పట్టుకోవాలి... గురి ఎలా చూడాలి... షూట్ చేసేందుకు ఎలా నిలబడాలి... తదితర విషయాలను కాగితాలపై బొమ్మలు గీసి శ్రీకాంత్‌కు ఈ క్రీడలోని మెళకువలను నేర్పించాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లోనూ పతకాలు నెగ్గిన శ్రీకాంత్ ఆసియా జూనియర్ చాంపియన్ షిప్, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ భారత్‌కు పతకాలు అందించాడు. ఈ నెలలో అజర్బైజాన్లో జరిగే ప్రపంచకప్‌లో ధనుష్ శ్రీకాంత్ భారత సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించనున్నాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ ట్రిస్టన్ స్టబ్స్..? -
బధిరుల ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి భవాని
తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి భవాని కేడియా వచ్చే నెలలో బ్రెజిల్ వేదికగా జరిగే బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 2010 నుంచి టెన్నిస్ ఆడుతున్న భవాని ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భవాని 2019లో చెన్నైలో జరిగిన బధిరుల జాతీయ క్రీడల్లో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకాలను గెలుచుకుంది. బధిరుల ఒలింపిక్స్‌లో భవానితోపాటు షేక్ జాఫ్రీన్, పృథ్వీ శేఖర్, ధనంజయ్ దూబే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
వారికిచ్చిన గౌరవం మాకేది?
ఢిల్లీ: తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వంపై భారత బధిర ఒలింపిక్స్ బృందం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. టర్కీలో జరిగిన డెఫ్లింపిక్స్ లో ఐదు పతకాలను సాధించి స్వదేశానికి చేరినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్వాగతం లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులు, సహాయ సిబ్బంది సహా మొత్తం 46తో కూడిన బధిర ఒలింపిక్స్ బృందం మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అయితే అక్కడ వారికి స్వాగత ఏర్పాట్లు కనిపించకపోగా, కనీసం పలకరించే వారు కూడా ఎవరూ లేరు. దాంతో తీవ్ర నిరాశ చెందిన వారు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గతంలో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లుకు వెళ్లిన వారికి ఘనమైన ఆహ్వానం పలికిన ప్రభుత్వం.. ఇప్పుడు తమ పట్ల ఎందుకు వివక్ష చూపుతుందంటూ మండిపడ్డారు. దేశం కోసం తాము సాధించిన పతకాలు తమకు అక్కర్లేదని, వాటిని తిరిగి ఇచ్చేస్తామన్నారు. తాము ఎప్పుడు వచ్చేది క్రీడామంత్రికి ముందుగానే సమాచారం ఇచ్చినా, తమను కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లేదిలేదంటూ అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా అఖిల భారత బధిర కౌన్సిల్ ప్రతినిధి కేతన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.' ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులు స్వదేశం చేరుకున్నప్పుడు సంబరాలు చేసుకున్నాం. ఇప్పుడు మన క్రీడాకారులు ఐదు పతకాలతో తిరిగి వచ్చారు. మరి వీరు క్రీడాకారులు కాదా?, బధిర క్రీడాకారులపై చిన్నచూపు ఎందుకు?, వారికిచ్చిన గౌరవం మాకేది?, క్రీడల మంత్రి విజయ్ గోయల్ కు మా రాకపై సమాచారం ఇచ్చినా ఎటువంటి స్పందనా రాకపోవడం బాధగా ఉంది. ఇక మాకు వచ్చిన పతకాలు ఎందుకు?'అంటూ కేతన్ షా ప్రశ్నించారు. అయితే దీనిపై విజయ్ గోయల్ స్పందించారు. అనారోగ్యంతో రాలేకపోయానని వివరణ ఇచ్చుకునే యత్నం చేశారు. భారత క్రీడా బృందానికి కర్నూలు వాసి జఫ్రిన్ నేతృత్వం వహించారు.