
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మరణించిన వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన స్విమ్మింగ్ కోచ్ కె. మల్లేశ్ కుటుంబానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) సహాయం అందించింది. బుధవారం ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు 5 లక్షల రూపాయల చెక్‌ను ఆయన భార్య ధనలక్ష్మికి అందజేశారు.
2009 నుంచి వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో స్విమ్మింగ్ కోచ్‌గా పనిచేస్తున్న మల్లేశ్ హఠాత్తుగా గుండెపోటుతో మే నెలలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సహాయంతో పాటు మల్లేశ్ భార్య ధనలక్ష్మి విద్యార్హతలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో ఉద్యోగం, వారి కుమారుడికి కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో అడ్మిషన్ కూడా ఖరారు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment