సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడా ప్రగతి చాలా జరిగిందని, క్రీడాభివద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శాట్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మన రాష్ట్రంలో క్రీడాభివద్ధికి తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు. ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు ప్రభుత్వ వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తన సొంత గ్రామమైన చిన్న చింతకుంట మండలం (మహబూబ్‌నగర్)లో మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ. 1.30 కోట్లు మంజూరు అయ్యేలా కషి చేశామని తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు రూ. 10,000 స్టయిఫెండ్, ఎల్బీ స్టేడియం పునర్నిర్మాణం, నూతనంగా 200 కోచ్‌ల నియామకం, ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్మాణానికి కషి చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార అభివద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్, గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత గుప్తా, కాచిగూడ కార్పొరేటర్ కన్నా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment