ఆయా సెంటర్‌లలో స్టేట్ లెవల్ ఎంపికలు పోటీలు
సద్వినియోగం చేసుకోవాలంటున్న పలువురు
కరీంనగర్ స్పోర్ట్స్: ప్రస్తుత కాలంలో క్రీడలపై ఆసక్తి ప్రతి ఒక్కరిలో పెరిగింది. ప్రపంచ పోటిలు, ఒలంపిక్స్ లాంటి మోగా పోటీల్లో భారత క్రీడాకారులు సాధించిన పతకాలతో క్రీడల్లో తమ పిల్లలను ప్రొత్సహించాలనే ఆసక్తి సైతం తల్లిదండ్రుల్లో మొదలైంది. దీనికి తోడు భారత్ ఇటీవలీ కాలంలో ప్రపంచ కప్ ఖోఖో పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం, పుట్‌బాల్ పోటీలు త్వరలో జరుగనుండడం, 2036లో ఒలంపిక్స్ నిర్వహించేందుకు బిడ్స్ వేయడం ఇలా చెప్పుకుంటే పోటే క్రీడలు క్రేజీగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సెంటర్‌లను వెలుగులోకి తెచ్చాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పలు క్రీడల్లో ఖేలో ఇండియా సెంటర్‌లను ఏర్పాటు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెంటర్‌లలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు సత్పలితాలు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, రంగారెడ్డిలలోని ఖేలో ఇండియా సెంటర్‌లలోని పలు క్రీడల్లో నూతన క్రీడాకారులకు అవకాశం కల్పించింది. ఏయే క్రీడల్లో ఖేలో ఇండియా సెంటర్‌లు ఉన్నాయి.....ఏ ప్రాంతంలో పోటీలు జరుగనున్నాయి....ఎలా హాజరుకావాలని తదితర వివరాలతో సాక్షి కథనం..
క్రీడలు...
హాకీ, అథ్లెటిక్స్, అర్చరీ (బాలబాలికలు) కబడ్డీ (బాలురు), జిమ్నాస్టిక్స్ (బాలబాలికలు)
కావాల్సిన పత్రాలు...
ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ పత్రం, స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లు, మెడికల్ సర్టిఫికేట్‌లు, విద్యార్హత పత్రాలు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు 2
అథ్లెటిక్స్, అర్చరీ (బాలబాలికలు), కబడ్డీ (బాలురు)....
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్ గచ్చీబౌళీ స్టేడియంలో, హాకీ కాంప్లెక్స్‌లో ఎంపికలు జరుగును. 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు గుర్తించబడిన క్రీడలో కనీసం రాష్ట్రస్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి.
హాకీ (బాలబాలికలు)..: ఫిబ్రవరి 4 నుంచి 6 తేదీల్లో హైదరాబాద్ గచ్చీబౌళీ స్టేడియంలో, హాకీ కాంప్లెక్స్‌లో ఎంపికలు జరుగును. 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు గుర్తించబడిన క్రీడలో కనీసం రాష్ట్రస్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి.
జిమ్నాస్టిక్స్ (బాలబాలికలు)...
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో రంగారెడ్డి ఎల్బీనగర్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంపికలు జరుగును. 8 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలబాలికలు అర్హులు. ఎంపిక పోటీలకు హాజరయ్యే వారు కనీసం జిల్లా స్థాయి పోటిల్లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. క్రీడాకారులు 4న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment