
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణకు మరో స్వర్ణం లభించింది. గువాహటిలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఆదివారం జరిగిన అండర్–17 బాలికల 100 మీటర్ల విభాగం ఫైనల్లో జీవంజి దీప్తి విజేతగా నిలిచింది. దీప్తి 12.26 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త మీట్ రికార్డు నెలకొల్పింది. రుతిక శరవణన్ (తమిళనాడు), షెరోన్ మారియా (తమిళనాడు)లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి.