సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ పవర్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (సీపీఎస్‌యూ) కబడ్డీ టోర్నమెంట్‌లో పవర్‌గ్రిడ్ జట్టు శుభారంభం చేసింది. పవర్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (పీఎస్‌సీబీ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తొమ్మిది ‘సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ పవర్ యూనిట్’ జట్లు తలపడుతున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో పవర్‌గ్రిడ్ జట్టు 54–13తో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) జట్టుపై ఘన విజయం సాధించింది.
ఇతర మ్యాచ్‌ల్లో భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (బీబీఎంబీ) 50–14తో మినిస్ట్రీ ఆఫ్ పవర్ (ఎంఓపీ)పై, ఎస్‌జేవీఎన్ జట్టు 46–11తో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)పై, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) 52–21తో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ)పై, ఎన్‌హెచ్‌పీసీ 102–20తో ఎంఓపీపై గెలుపొంది ముందంజ వేశాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవర్‌గ్రిడ్ (ఎస్‌ఆర్‌టీఎస్–1) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పవర్‌గ్రిడ్ సంస్థ అధికారులు, ‘శాట్స్’ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment