Hyderabad Black Hawks Soar High in Strategic Partnership With Italy - Sakshi
Sakshi News home page

Volleyball : హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌ కొత్త పార్ట్‌నర్‌ పల్లవోలో పడోవా

Published Fri, May 19 2023 7:35 PM | Last Updated on Sat, May 20 2023 7:54 AM

Press Release - Hyderabad Black Hawks Soar High in Strategic Partnership with Italy - Sakshi

భారతదేశపు ప్రీమియర్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, ఇటలీకి చెందిన సూపర్‌లిగాకు చెందిన ప్రముఖ క్లబ్ పల్లవోలో పడోవాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని వల్ల బ్లాక్‌ హాక్స్‌ ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి కోచింగ్ మరియు విస్తృత మౌలిక సదుపాయాలను అందుబాటులోకి రానున్నాయి. 

అత్యుత్తమ వ్యూహాలు మరియు సాహసోపేత నిర్ణయాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, భారత వాలీబాల్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో మొదటి ప్రపంచ స్థాయి కోచ్‌ను నియమించడం, సంచలనాత్మక షోబిజ్ అనుభవాన్ని సృష్టించడం మరియు అభిమానుల తో అనుబంధం విస్తరించడానికి ప్రముఖులను చేర్చుకుంది బ్లాక్ హాక్స్.

ఇటాలియన్ సూపర్‌లిగాలో ప్రధాన కేంద్రంగా పల్లవోలో పడోవా ఉంది. అత్యుత్తమ గేమ్ సెన్స్ ద్వారా తన ఆటగాళ్లను శక్తివంతం చేయడంలో ఈ  క్లబ్‌ పేరు గాంచింది. వీరిద్దరి భాగస్వామ్యం వల్ల రాబోయే రోజుల్లో బ్లాక్ హాక్స్ అనేక మంది ఆటగాళ్లను ఇటలీలోని పడోవాకు శిక్షణ కోసం పంపుతుంది. అలాగే ప్రపంచ స్థాయి కోచింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మరియు యూత్ ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించడంలో బ్లాక్ హాక్స్‌కు పడోవా తమ కోచ్‌లను భారత్‌కు పంపుతుంది.

బ్లాక్ హాక్స్ ముఖ్య యజమాని, అభిషేక్ రెడ్డి కంకణాల మాట్లాడుతూ  " ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ పూల్‌ భారతదేశం దగ్గర ఉంది. మన ప్రతిభావంతులైన యువతను ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దడానికి, మాకు అత్యున్నత మౌలిక సదుపాయాలు మరియు అగ్రశ్రేణి కోచింగ్ రెండూ అవసరం. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ మరియు పడోవాతో మా కొత్త భాగస్వామ్యం తో మేము దానిని సాకారం చేస్తున్నాము" అని అన్నారు.

పడోవా ప్రెసిడెంట్, జియాన్‌కార్లో బెట్టియో, మాట్లాడుతూ.. "కోచింగ్‌లో  50 సంవత్సరాల అనుభవం ఉంది, మేము మా నైపుణ్యాన్ని ఇక్కడి ఆటగాళ్లకు పంచడానికి ఆసక్తిగా ఉన్నాము, మేము మా క్లబ్‌లు వాలీబాల్ భవిష్యత్తును పునర్నిర్మించగలవనే నమ్మకం తో ఉన్నాము " అని అన్నారు.

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యొక్క సూత్రప్రాయ స్పాన్సర్ A23 ఈ పార్ట్‌నర్‌షిప్‌పై సంతోషం వ్యక్తం చేసింది. "వాలీబాల్ వంటి నైపుణ్యం కలిగిన ఈవెంట్‌లను విస్తృత ప్రేక్షకులకు అందించడానికి మేము అంకితభావంతో ఉన్నాము. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా మా బ్రాండ్ విజిబిలిటీని మాత్రమే కాకుండా భారతీయ   వాలీబాల్ క్రీడాకారులు కు ప్రపంచ వేదికను అందిస్తుంది. మేము ఈ అవకాశం గురించి మరింత ఆసక్తి గా ఉన్నాము " అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement