
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ‘ఎ’ లీగ్ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కబడ్డీ టోర్నీలో ‘సాయ్’ జట్టు ఘనవిజయం సాధించింది. సరూర్‌నగర్ శాట్స్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సాయ్ 35–28తో ఏఓసీపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... ఏఓసీ జట్టు కాస్త ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో తొలి అర్ధభా గంలో సాయ్ జట్టు 12–15తో వెనుకబడింది.
అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న సాయ్ జట్టు క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ గెలుపొందింది. విజేత జట్టులో ప్రదీప్ ఆకట్టుకున్నాడు. ఏఓసీ తరఫున శ్రీనాథ్, రాజు మెరుగ్గా రాణించారు. ఇతర మ్యాచ్‌ల్లో హెచ్‌ఏఎల్ 36–25తో శాట్స్‌పై నెగ్గగా, ఎస్‌సీఆర్ 42–28తో తెలంగాణ పోస్టల్‌ను ఓడించింది.