సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే కబడ్డీ మహిళల టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్స్ వేదికగా బుధవారం జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మహిళల విభాగంలో జరుగుతోన్న ఈ టోర్నీలో రైల్వేస్‌కు చెందిన ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీ శుక్రవారంతో ముగుస్తుంది.
ఇందులో పాల్గొన్న దక్షిణ మధ్య రైల్వే, సెంట్రల్ రైల్వే, ఈస్ట్రన్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, నార్తర్న్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్‌ఈస్ట్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే జట్లను రెండు ‘పూల్’లుగా విభజించి పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్‌సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తితో రాణించి ఆటగాళ్లు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment