సాక్షి, కీసరగుట్ట(మేడ్చల్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' చాలెంజ్‌లో భాగంగా కీసరగుట్టలోని రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 2,042 ఎకరాల అటవీ ప్రాంతంలో తన వంతుగా ఎకో టూరిజం పార్కు, అటవీ పునరుజ్జీవన అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అటవీ ప్రాంతాల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలని కోరుతూ సంతోష్ కుమార్ పలువురు ప్రముఖులను 'గిఫ్ట్ ఏ స్మైల్'కు హ్యాష్ ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన వారిలో మాజీ ఎంపీ కవిత, సినీ హీరోలు విజయ్‌దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామిక వేత్త ముత్తా గౌతమ్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment